ఫిబ్రవరి 29,2024 న సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నెల్లూరు మేత్రాసనంలోని కనిగిరి విచారణ నందు గురుశ్రీ సిహెచ్ భాస్కర్ గారి సారథ్యంలో, గురుశ్రీ యమ్ హృదయరాజు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చెరసాల పరిచర్య సమన్వయకర్త గురుశ్రీ పసల లహాస్త్రాయ అధ్యక్షతన చెరసాల పరిచర్య మేత్రాసన వార్షిక సమావేశం జరిగింది.
వరంగల్ మేత్రాసనం,మర్రిపెడ విచారణ కర్తలు, పవిత్రాత్మ సభకు (ALCP/OSS) చెందిన గురుశ్రీ మాదాను జాకబ్ గారు 2 మార్చి 2024న ఉదయం 4:30 గంటలకు గుండెపోటుతో మరణించారు.
ఫ్రాన్సిస్ పాపు గారు ఫిబ్రవరి 27, 2024న కర్నూలు మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా OCD సభకు చెందిన గురుశ్రీ గోరంట్ల జ్వాన్నేసు గారిని నియమిస్తూ ప్రకటించారని తెలియచేయుటకు సంతోషిస్తున్నాం.
ఫిబ్రవరి 26,2024 న సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు కడప మేత్రాసనంలోని MPSSS నందు గురుశ్రీ జంపంగి సుధాకర్ గారి సారథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చెరసాల పరిచర్య సమన్వయకర్త గురుశ్రీ పసల లహాస్త్రాయ అధ్యక్షతన, గురుశ్రీ టి బాలరాజు గారి ఆధ్వర్యంలో చెరసాల పరిచర్య మేత్రాసన వార్షిక సమావేశం జరిగింది.
25 ఫిబ్రవరి 2024న సాయంత్రం 5:30 గంటలకు వరంగల్ మేత్రాసనం, ఫాతిమామాత కథడ్రల్ నందు 2024 విద్యా సమవత్సరంలో ఆ దేవుని దీవెనలు విచారణ బాలబాలికలపై కురిపించినందుకు కృతజ్ఞతగా దివ్యబలి పూజను అర్పించారు.
ఫ్రాన్సిస్ పాపు గారు గురువారం, ఫిబ్రవరి 22, 2024న పునీత పేతురు బోధన సింహాసనోత్సవం రోజున ఫిలిప్పీన్స్, బికోల్ ప్రాంతంలోని కాసెరెస్ నూతన అగ్రపీఠాధిపతిగా గురుశ్రీ రెక్స్ ఆండ్రూ అలార్కాన్ గారిని నియమించారు.
ఫిబ్రవరి 22న బ్యాంకాక్లో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) సమావేశంలో గోవా మరియు డామావో అగ్రపీఠాధిపతులు భారతీయ కార్డినల్ మహా పూజ్య ఫిలిప్ నెరి ఆంటోనియో సెబాస్టియో డో రోజారియో ఫెర్రో అధ్యక్షులుగా మరియు ఫిలిఫైన్స్,కలూకాన్ పీఠాధిపతులు మహా పూజ్య పాబ్లో విర్జిలియో సియోంగ్కో డేవిడ్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సోషల్ ఫోరమ్ వారు గుంటూరు మేత్రాసనం, మనోవికాస కేంద్రం పునీత అన్నమ్మ మానసిక వికలాంగుల పాఠశాల వారికి ఫిబ్రవరి 20,2024 న పేపర్ ప్లేట్ల తయారీ యంత్రం విరాళంగా అందించారు
బెంగళూరు, కర్ణాటక రీజినల్ ఆర్గనైసెషన్ ఫర్ సోషల్ సర్వీస్ (KROSS ) నందు భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య CBCI న్యాయ, శాంతి, అభివృద్ధి విభాగం వారు జెపిడి కార్యదర్శులకు ఫిబ్రవరి 21 -22 ,2024 రెండు రోజులపాటు సమావేశం నిర్వహించింది.