‘ది చోజెన్’ కోసం కాథలిక్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గా అజిన్ జోసెఫ్ నియామకం

‘ది చోజెన్’ కోసం కాథలిక్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గా అజిన్ జోసెఫ్ నియామకం

భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CCBI) దేశవ్యాప్తంగా విశ్వాస బోధన మరియు సువార్త ప్రచార కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా, ది చొసెన్ ఇన్ ఇండియాకు కాథలిక్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గా శ్రీ అజిన్ జోసెఫ్‌ను నియమించినట్లు కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా (CCBI) ప్రకటించింది.

ఢిల్లీ అగ్రపీఠానికి చెందిన శ్రీ అజిన్ జోసెఫ్, భారతదేశం మరియు విదేశాలలో డెబ్బైకి పైగా మేత్రాసనాలలో సేవలందించిన నిబద్ధత కలిగిన ప్రో-లైఫ్ స్పీకర్ మరియు సంగీతకారుడు.

జనవరి 6న బెంగళూరులోని CCBI సెక్రటేరియట్‌లో ది ఛోసెన్ ఇండియా కంట్రీ మేనేజర్ ఆశిష్ నాగ్ సమక్షంలో CCBI అసోసియేట్ డిప్యూటీ సెక్రటరీ జనరల్  ఫాదర్ క్రిస్టోఫర్ విమల్‌రాజ్ గారు అధికారిక నియామక లేఖను శ్రీ అజిన్ జోసెఫ్‌కు అధికారికంగా అందజేశారు.

"ది ఛోసెన్"  (The Chosen) అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని  జీవితం మరియు అయన పరిచర్యను వర్ణించే ఏడు సీజన్ల టెలివిజన్ సిరీస్.ఈ సిరీస్ పలు భారతీయ భాషల్లో అందుబాటులో , ది చోసెన్ టీవీ ప్లాట్‌ఫామ్ మరియు మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చు. 

ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తయిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకులను చేరుకుంది. భారతదేశంలో శ్రీసభలో బోధన, సువార్త ప్రచారం మరియు విశ్వాస నిర్మాణానికి ప్రభావవంతమైన సాధనంగా ది చోసెన్ సిరీస్‌ను ప్రోత్సహించేందుకు CCBI, ది చోసెన్ బృందంతో కలిసి పనిచేస్తోంది. 

ఈ  మిషన్‌ను కొనసాగిస్తూ, శ్రీ అజిన్ జోసెఫ్ గారికి సంపూర్ణ సహకారం అందించాలని అన్ని మేత్రాసనాలు, మతసంఘాలు, సంస్థలు మరియు అపోస్తలేట్‌లను CCBI కోరింది.

ఈ ప్రకటనను భారత కాథలిక్ బిషప్‌ల సమావేశం (CCBI) అధ్యక్షుడు మరియు గోవా మరియు డామన్ అగ్ర పీఠాధిపతులు  కార్డినల్ మహా పూజ్య  ఫిలిప్ నేరి  గారు విడుదల చేశారు.

Article and design by

M Kranthi Swaroop