భక్తియుతంగా కైలాసపురంలో భద్రమైన అభ్యంగం స్వీకరణ

భక్తియుతంగా  కైలాసపురంలో భద్రమైన అభ్యంగం స్వీకరణ మరియు విచారణ స్థాయిలో జూబిలీ 2025 ప్రారంభోత్సవం

 విశాఖ అతిమేత్రాసనం వేళాంగణిమాత దేవాలయం, కైలాసపురం విచారణలో జనవరి 19,2025 ఆదివారంనాటి  దివ్యబలి పూజలో 92మంది విశ్వాసులు భద్రమైన అభ్యంగనం స్వీకరించారు. మరియు విచారణ స్థాయిలో జూబిలీ 2025  ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర గురువులతో కలసి దివ్య పూజాబలిని సమర్పించారు. మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు.

మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారి చేతులమీదుగా 92 మంది విశ్వాసులు భద్రమైన అభ్యంగనం స్వీకరించారు. వారందరి కొరకు పీఠాధిపతుల వారు ప్రత్యేక ప్రార్థనలు చేసారు.

11 సంవత్సరాల తరువాత ఈ  విచారణలో భద్రమైన అభ్యంగ స్వీకరణ కార్యక్రమం జరిగింది. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. విచారణ సహాయక గురువులు  గురుశ్రీ జాన్ CMF  గారు తన సహాయ సహకారాలను అందించారు.

అనంతరం విచారణ స్థాయిలో 2025 జూబిలీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పిల్లలు, యువతీయువకులు, మఠవాసులు, గురువులతో కలసి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు మరియు గురుశ్రీ సంతోష్ గార్లు పవిత్ర సిలువను చేతబూని ప్రదక్షణగా  దేవాలయములోనికి ప్రవేశించారు.

జూబిలీ 2025 సంవత్సరాన్ని ప్రారంభించి, పవిత్ర సిలువను ప్రతిష్టించి, దివ్యబలి పూజను సమర్పించిన విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారికి, విచ్చేసిన గురువులకు,మఠవాసులకు, విచారణ విశ్వాసులకు, గాయక బృందానికి  గురుశ్రీ సంతోష్ CMF, గారు కృతజ్ఞతలు తెలిపారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer