భవిష్యత్ నాయకులను శక్తివంతం చేయడం మన బాధ్యత : IFFAsia
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మేషన్, ఫోండాసియో ఆసియా (IFFAsia) ఫిబ్రవరి 2న ఫిలిప్పీన్స్లోని "రేడియో వెరిటాస్ ఆసియా" క్యాంపస్లో 11 నెలల నిర్మాణ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2025 విద్యా సంవత్సరానికి సంబందించి ఇది 16బ్యాచ్.
అమృతవాణి స్వర్ణ జూబిలీ ఆత్మీయ సమ్మేళనం (Golden Jubilee Reunion ) ఘనంగా జరిగింది. ఏలూరు పీఠాధిపతి మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి, అమృతవాణి అధ్యక్షులు మహా పూజ్య పొలిమేర జయరావు, D.D. గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
హైదరాబాద్ అతిమేత్రాసనం పునీత జోజప్ప గారి దేవాలయం, బొల్లారం విచారణలో తపస్సు కాల ప్రత్యేక దివ్య బలిపూజ భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ వేలంటైన్ డిమెల్లో గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆంధ్ర, తెలంగాణ కథోలిక శ్రీసభకు ఎనలేని సేవలు అందించిన అమృతవాణి సికిందరాబాదు లో ఉంది. అక్కడి అమృతవాణి భవనాన్ని నిర్మించి అమృతవాణి కార్యాలయంగా ప్రారంభించి 50 వ సంవత్సరం సందర్భంగా జూబిలీ చిహ్నాన్ని ప్రారంభించారు.
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో పాప పశ్చాత్తాప పాద యాత్ర" భక్తియుతంగా జరిగింది. శనివారం ఉ|| 5 గం||లకు వేళాంగణి మాత దేవాలయం నుండి మేరీమాత కొండ గుడి వరకు ఈ పాప పశ్చాత్తాప పాద యాత్ర నిర్వహించారు.