వెరోనా కాథలిక్ ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో సమావేశమైన పొప్ ఫ్రాన్సిస్

జనవరి 18, కన్‌సిస్టరీ హాల్‌లో జెనరలీ ఇటాలియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన కాథలిక్ ఫౌండేషన్ ఆఫ్ వెరోనా ప్రతినిధి బృందంతో  పొప్ ఫ్రాన్సిస్ సమావేశమయ్యారు. 

వెరోనా ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ "బలహీనులకు మద్దతు ఇచ్చే మరియు శ్రీసభ సామాజిక సిద్ధాంతానికి అనుగుణంగా ఉండే చొరవల వైపు సంపదను మళ్లించాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు .

శ్రీసభ సామాజిక సిద్ధాంతం ఆధారంగా ఆర్థిక వనరులను సాధారణ మంచి కోసం ఉపయోగించాలనే నైతిక బాధ్యతను పోప్ ఫ్రాన్సిస్ పునరుద్ఘాటించారు మరియు ఆయుధ పరిశ్రమలో పెట్టుబడులను ఆయన ఖండించారు.

‘చంపడానికి ఆయుధాలలో పెట్టుబడి పెట్టడం పిచ్చితనం’ అని పొప్ ఫ్రాన్సిస్ అన్నారు 

స్థానిక కమ్యూనిటీల ప్రయోజనాల కోసం లాభాపేక్ష లేని సంస్థలు మరియు సామాజిక వెంచర్‌లకు ఫౌండేషన్ మద్దతునిచ్చే ప్రతినిధి బృందానికి, భూమిపై మానవత్వం పాత్ర "నిర్వాహకత్వం", "యాజమాన్యం" కాదు అని పొప్ ఫ్రాన్సిస్ గుర్తుచేశారు

కాథలిక్ ఫౌండేషన్ సంఘీభావం పట్ల చూపిన నిబద్ధతను పోప్ ఫ్రాన్సిస్ గుర్తించారు, ముఖ్యంగా వెరోనా మేత్రాసనం సహకారంతో కుటుంబాలు మరియు యువతకు సహాయం చేయడంలో దాని పనిని ప్రశంసించారు.