దైవవాక్కు మనలో నూతన ఉత్సాహాన్ని, వెలుగును తెస్తుందన్న పొప్ ఫ్రాన్సిస్

జనవరి 26, సామాన్య మూడవ ఆదివారం నాడు సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన దివ్యబలి పూజలో "మనం దేవుని రాజ్యం వైపు ప్రయాణిస్తున్నప్పుడు పరస్పర అంగీకారం మరియు సహవాసానికి పిలుపునిస్తుంది పొప్ ఫ్రాన్సిస్ అన్నారు.

క్రీస్తే సజీవ వాక్కు,ఆ వాక్కును మనం ఆలకించి,పాటించి, మన హృదయాలలోకి ఆహ్వానించాలని వాటికన్ లో నిర్వహించిన ప్రపంచ సమాచార జూబ్లీ సందర్బంగా తెలిపారు 

దేవుని వాక్కు ఎంతో సంతోషకరమైనదని,దేవుని రాజ్యం వైపు యాత్ర చేస్తున్న మనం ఆ వాక్కును నలుగురితో పంచుకోవాలని, ప్రకటించాలని పోప్ కోరారు.

క్రైస్తవులుగా పిలవబడే ప్రతి ఒక్కరూ నవ్య సువార్తికరణలో పాలి భాగస్తులు కావాలని, ఈ జూబిలి సంవత్సరంలో ప్రతి ఒక్కరూ దేవుని వెలుగులో ప్రయాణిస్తూ,విశ్వాస జీవితాన్ని జీవించాలని పొప్ ఫ్రాన్సిస్ ముగించారు.