అమెరికా అధ్యక్షుడికి సందేశాన్ని పంపిన పొప్ ఫ్రాన్సిస్
జనవరి 20 న అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ జె. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి పోప్ ఫ్రాన్సిస్ ఒక సందేశాన్ని పంపారు.
'ప్రియమైన అమెరికన్ ప్రజలకు' అధ్యక్షుడు ట్రంప్ మరియు అతని కుటుంబ సభ్యులపై దైవిక ఆశీర్వాదాలను అందిస్తూ, శాంతి వైపు ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేయడానికి ప్రభువు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నారు అని ఆయన అన్నారు.
అమెరికా సువర్ణావకాశాల నేలగా, అందరినీ ఆహ్వానించే దేశంగా ప్రతిష్ఠను నిలబెట్టుకుంటుందని తన ప్రార్ధనల్లో కోరుకుంటున్నట్టు పొప్ ఫ్రాన్సిస్ తెలిపారు
'మీ నాయకత్వంలో అమెరికా ప్రజలు అభివృద్ధి సాధిస్తారని, న్యాయబద్ధమైన సమాజ నిర్మాణానికి మీరు కృషి చేస్తారని భావిస్తున్నాను, అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.