వాటికన్ గవర్నరేట్ కు అధ్యక్షత వహించనున్న సిస్టర్ రఫెల్లా పెట్రిని

ఆదివారం జనవరి 19 సాయంత్రం ప్రసారమైన ఇటాలియన్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సిస్టర్ పెట్రినిని అధ్యక్ష పదవికి నియమించాలనే తన ఉద్దేశ్యాన్ని పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు.

ప్రస్తుతం సెక్రటరీ జనరల్ గా ఉన్న సిస్టర్ రఫెల్లా పెట్రిని 2025 మార్చిలో వాటికన్ సిటీ స్టేట్ గవర్నరేట్ కు అధ్యక్షత వహించనున్నారు 

కార్డినల్ ఫెర్నాండో వెర్గెజ్ అల్జాగా (Cardinal Fernando Vérgez Alzaga) గవర్నరేట్ అధ్యక్ష పదవి నుండి పదవీ విరమణ చేసిన తర్వాత ఈ నియామకం జరుగుతుంది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వలసదారులను భారీగా బహిష్కరించే అవకాశంపై విచారం, గాజాలో కాల్పుల విరమణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

వలసదారులను స్వాగతించడం, కొనసాగుతున్న జూబ్లీ, రోమ్‌లోని జైలులో పవిత్ర ద్వారం తెరవాలనే తన నిర్ణయం, దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నాలు మరియు తన వ్యక్తిగత ఆరోగ్యం గురించి పోప్ ఈ ఇంటర్వ్యూ లోచర్చించారు.

మోండడోరి (Mondadori) ప్రచురించబడిన,100 దేశాలలో అందుబాటులో ఉన్న తన ఆత్మకథ 'హోప్'ను ప్రదర్శించడానికి కూడా ఈ ఇంటర్వ్యూ ఒక అవకాశంగా ఉపయోగపడింది.

ఈ నిరిక్షణా సంవత్సరంలో వచే అవకాశాలను ఉపయోగించుకుని ధైర్యంగా ముందుకు సాగండి అని పిలుపునిస్తూ పులుపునిస్తూ ఇంటర్వ్యూను ముగించారు