వ్యాధిగ్రస్తులకు దేవుడు చేరువలో ఉంటారన్న పొప్ ఫ్రాన్సిస్

ఫిబ్రవరి 11 న  33వ వ్యాధిగ్రస్తుల దినోత్సవం పురస్కరించుకొని పోప్ ఫ్రాన్సిస్ అందించిన సందేశాన్ని వాటికన్ విడుదల చేసింది. 

అనేక రకమైన అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి దేవుడు చేరువలో ఉంటాడని, వారి బాధలకు ఉపశమనాన్ని అందిస్తారని ఆయన అన్నారు. 

క్రీస్తుప్రభువు శిష్యులతో దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ, వ్యాధిగ్రస్తులను ఆదరించాలని చెప్పారని ఇదే బాటలో శ్రీసభతో కలిసి మనం కూడా ముందుకు నడవాలని ఆయన కోరారు. 

వ్యాధిగ్రస్తులను దూరం పెట్టటం, వారిని పట్టించుకోకుండా ఉండటం దేవుడు
అసహ్యించుకుంటారని, వ్యాదిగ్రస్తులను ఆదరిస్తూ వారి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించాలని పొప్ ఫ్రాన్సిస్ కోరారు.