About Us
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో గుర్తించబడిన ఆసియా ఉత్పత్తి కేంద్రాల సహకారంతో మరియు మానవ అభివృద్ధి మరియు కాథలిక్ సువార్తీకరణ కార్యక్రమాలు అందించడం ద్వారా ఆసియా ప్రజలకు దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని ప్రకటిస్తామని "రేడియో వెరితాస్ ఆసియ తెలుగు" విభాగం కట్టుబడి ఉంది.
ఆసియా ప్రజలకు దేవుని ప్రేమ యొక్క సందేశాన్ని ప్రకటిస్తూ "రేడియో వెరితాస్ ఆసియ తెలుగు" తెలుగు తన సువార్తీకరణ యొక్క కార్యాచరణను పునరుద్ఘాటిస్తుంది.
భారతదేశం మరియు చుట్టుపక్కల ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలను చేరుకోవటానికి 1977 లో RVA లో తెలుగు విభాగం ప్రారంభమైంది. 1977 యొక్క క్రీస్తు పునరుత్తానా పండుగ రోజున పరీక్షా ప్రసారం మొదలైంది, తద్వారా 33 సంవత్సరాల నిరంతర సేవతో తెలుగు భాషలో ఒక పెద్ద సువార్త ప్రసారము రేడియో లో జరిగినది.
"రేడియో వెరితాస్ ఆసియ తెలుగు" విభాగము అన్ని తరగతులకు చెందిన ప్రేక్షకులకు కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. అనగా చిన్న పిల్లలు, యువత, స్త్రీలు, మతపరమైన మరియు సామాన్య ప్రజలకు. క్రైస్తవ, సమాచారాన్ని ప్రపంచ సమాచారం తో అనుసంధానించి ప్రసారం చేయు కార్యక్రమం మా ప్రసారాలలోనే ఒక కలికితురాయి.
ఇపుడు "రేడియో వెరితాస్ ఆసియ " ప్రజలకు మరింత దగ్గర కావాలని రేడియో నుండి సోషల్ మీడియా లోనికి వచ్చింది .తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజల కు సువార్తను అందించాలనే సంకల్పం తో "రేడియో వెరితాస్ ఆసియ తెలుగు" విభాగం మొదలైనది .
ఈ విభాగం అమృతవాణి యొక్క నాయకత్వంలో నడప బడుతుంది . అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ మారియదాస్ గారు "రేడియో వెరితాస్ ఆసియ తెలుగు" విభాగానికి కూడా డైరెక్టర్ గా వ్యవహరిస్తారు.
ఫా|| రిచర్డ్ జాన్, బి. అరవింద్, యమ్. కె .స్వరూప్ మరియు వై. పూజితల తో కూడిన సిబ్బంది అమృతవాణి తరుపున రేడియో వెరితాస్ ఆసియ తెలుగు కు తమ సేవలను అందిస్తున్నారు. సామాన్య, లౌకిక మీడియా నుండి ఎదురౌతున్న సవాళ్ళను ఎదురుకుంటూ దైవ వాక్య వ్యాప్తి తో మానవ విలువల అభివృద్ధి కి కృషి చేస్తున్నాము.
Address :
రేడియో వెరితాస్ ఆసియ తెలుగు,
పోస్ట్ బాక్స్ 1588, సికింద్రాబాద్,
తెలంగాణ , ఇండియా -530003