పేదలకు ఆశాజ్యోతిగా భారత పీఠాదిపతులు ఉండాలని పిలుపునిచ్చిన పొప్ ఫ్రాన్సిస్

36వ CCBI సర్వసభ్య సమావేశంలో పాల్గొంటున్న భారతీ పీఠాదిపతులకు జనవరి 28, 2025 న పొప్ ఫ్రాన్సిస్ సందేశాన్ని పంపారు

భారత పీఠాదిపతులంతా వారి పరిచర్యలో పేదలకు మరియు దుర్బల పరిస్థితులకు ప్రాధాన్యత ఇవ్వాలని మరియు సినడల్ మార్గంలో ప్రయాణం చేయాలని పిలుపునిచ్చారు 

ఒడిశా రాష్ట్రంలోని కటక్-భువనేశ్వర్ అగ్రపీఠంలో జరుగుతున్న అసెంబ్లీని ఉద్దేశించి పోప్ ఒక సందేశంలో, వారి చర్చలు “స్థానిక శ్రీసభ సైనోడల్ మార్గం యొక్క ఫలాలను ఎలా ఉత్తమంగా అమలు చేయాలో గ్రహించడానికి మరియు మిషనరీ శిష్యులుగా వారి వృత్తిలో అనేక మంది విశ్వాసులను ప్రేరేపించడానికి సహాయపడతాయని” ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

జుబ్లీ సంవత్సరాన్ని పోప్ ప్రస్తావిస్తూ, “భారతదేశంలో శ్రీసభ యావత్తు దేశానికి ఆశాకిరణంగా ఉంటుందని తాను విశ్వసిస్తున్నానని, పేదలు మరియు అత్యంత దుర్బల పరిస్థితులలో ఉన్న వారిని ఆహ్వానించడానికి ఎల్లప్పుడూ తన తలుపులు తెరవాలని, తద్వారా అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను” అన్నారు.

భారతదేశంలోని లాటిన్ చర్చికి చెందిన 204 మంది పీఠాధిపతులు ఈ సమావేశానికి  హాజరైయ్యారు.

మూడు రోజుల ఆధ్యాత్మిక తిరోగమనం తర్వాత, ఈ సమావేశం ఫిబ్రవరి 4 వరకు కొనసాగుతుంది