36వ CCBI సర్వసభ్య సమావేశానికి సిద్ధమైన భువనేశ్వర్‌

జనవరి 28 నుండి ఫిబ్రవరి 4 వరకు భువనేశ్వర్‌ XIM విశ్వవిద్యాలయంలో జరగనున్న 36వ CCBI సర్వసభ్య సమావేశానికి సన్నాహకంగా జనవరి 26-27, 2025 తేదీలలో రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించబడింది.

కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CCBI) మరియు ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) అధ్యక్షుడు కార్డినల్ ఫిలిప్ నెరి ఫెరో " శ్రీసభ ప్రేషితకార్యంలో భాగస్వామ్య మరియు సినడల్ విధానాన్ని అవలంబించాలని కోరారు 

CCBI కార్యదర్శులు మరియు ప్రాంతీయ డిప్యూటీ కార్యదర్శులు దీనిలో పాల్గొన్నారు.

ఈ సమావేహంలో పాల్గొనే వారందరు సమిష్టి వివేచన, చురుకైన భాగస్వామ్యం మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించే అవసరాన్ని కార్డినల్ వివరించారు 

వర్క్‌షాప్ సందర్భంగా, CCBI కమిషన్ల కార్యదర్శులు మరియు ప్రాంతీయ డిప్యూటీ కార్యదర్శులకు ఆధ్యాత్మిక సంభాషణ పద్ధతిలో శిక్షణ ఇవ్వబడింది.