విన్సెంటియన్ల సేవా దృక్పథం శ్రీసభ పునరుద్ధరణకు తోడ్పడుతుందన్న పొప్ ఫ్రాన్సిస్

పునీత విన్సెంట్ డి పాల్ సభ స్థాపించబడి 400 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పోప్ ఫ్రాన్సిస్ సుపీరియర్ జనరల్ గురుశ్రీ టోమాజ్ మావ్రిక్‌కు ( Fr. Tomaž Mavrič) లేఖ పంపారు.

అందులో, "పేదవారిలో క్రీస్తును చూడడం వారికి సేవ చేయడం" నేటి శ్రీసభకు పునరుద్ధరణకు తోడ్పతుంది అని పొప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు 

ఈ సభ సేవా కార్యక్రమాలు ప్రపంచంలోని అనేక పరిధులలో అవసరంలో ఉన్నవారికి మరియు వదిలివేయబడినవారికి సహాయం" రూపంలో ఉంటుంది.

నేడు, విన్సెంటియన్ల కుటుంబంలో గురువులు,మఠకన్యలు, మతపెద్దలు మరియు దైవప్రజలు  100 కంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి.

దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొనడం మరియు మతాధికారుల, సామాన్యుల ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మరియు ఏర్పాటులో సహాయం చేయడం ఈ శాఖల లక్ష్యం 

పునీత విన్సెంట్ డి పాల్ సొసైటీ, దీనిని 1833లో బ్లెస్డ్ ఫ్రెడెరిక్ ఓజానమ్ స్థాపించారు.

ఈ సభ "ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సభ్యులతో పేదల సేవలో మంచి కోసం ఒక అసాధారణ శక్తి" అని పొప్ ఫ్రాన్సిస్ లేఖలో పేర్కొన్నారు.

Tags