విశాఖ అతిమేత్రాసనం, ఎర్రసామంతవలస గిరిజన విచారణలో సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ స్వస్థత ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది.విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్రసామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది.
అమృతవాణి స్వర్ణ జూబిలీ ఆత్మీయ సమ్మేళనం (Golden Jubilee Reunion ) ఘనంగా జరిగింది. ఏలూరు పీఠాధిపతి మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి, అమృతవాణి అధ్యక్షులు మహా పూజ్య పొలిమేర జయరావు, D.D. గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఘనంగా ఖమ్మం కతోలిక పీఠకాపరి అభిషేక మరియు పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం
ఖమ్మం కతోలిక పీఠకాపరి గా మహా పూజ్య సగిలి ప్రకాష్ గారు పదవీ బాధ్యతల స్వీకరించారు.
శ్రీ సభ పాలకులు మహా పూజ్య ఫ్రాన్సిస్ పోపు గారు కడప పీఠానికి చెందిన పూజ్య మోన్సిగ్నోర్ సగిలి ప్రకాష్ గారిని ఖమ్మం మేత్రాసన నూతన పీఠాధిపతి గా నియమించియున్నారు.
బైబిల్ కోర్సుల ద్వారా విశ్వాసులను బలపరుస్తున్న DCBA
గోవా మరియు డామన్ అగ్రపీఠంలోని "డియోసెసన్ సెంటర్ ఫర్ బైబిల్ అపోస్టోలేట్" (DCBA) పాస్టోరల్ ఇయర్ 2023-2024లో బైబిల్ కోర్సులలో పాల్గొన్న 769 మంది విజయవంతంగా బైబిల్ కోర్సులను పూర్తి చేసారు.
ఆంధ్ర, తెలంగాణ కథోలిక శ్రీసభకు ఎనలేని సేవలు అందించిన అమృతవాణి సికిందరాబాదు లో ఉంది. అక్కడి అమృతవాణి భవనాన్ని నిర్మించి అమృతవాణి కార్యాలయంగా ప్రారంభించి 50 వ సంవత్సరం సందర్భంగా జూబిలీ చిహ్నాన్ని ప్రారంభించారు.