రోమ్‌లోని ఇండోనేషియా కతోలికులతో సమావేశమైన పోప్
సెప్టెంబర్ 22 సోమవారం రోమ్‌లో నివసిస్తున్న ఇండోనేషియా నుండి వచ్చిన కతోలికులతో పోప్ లియో సమావేశమైయ్యారు
పోప్ ఫ్రాన్సిస్ ఈ దేశానికి చేసిన అపోస్టోలిక్ ప్రయాణం మొదటి వార్షికోత్సవం మరియు హోలీ సీ మరియు ఇండోనేషియా మధ్య దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏర్పాటు చేయడం జరిగింది
తన ప్రసంగంలో, ఆగ్నేఆసియా దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి హోలీ సీ వీరితో కలిసి నడిచిందని పోప్ గుర్తు చేసారు, ఆ సంబంధాలు గౌరవం, సంభాషణ మరియు శాంతి సామరస్యం పట్ల ఉమ్మడి నిబద్ధతపై నిర్మించబడ్డాయి అని ఆయన అన్నారు.
దివంగత పోప్ పర్యటనలో, ముఖ్యంగా Istiqlal మసీదును సందర్శించడం, మానవాళి మంచి కోసం ఐక్యతను పెంపొందించడానికి గ్రాండ్ ఇమామ్‌తో ఉమ్మడి ఒప్పందాల పై సంతకం చేసిన సమయంలో, మతాంతర సంభాషణ ప్రముఖంగా కనిపించింది.
"ఈ సమావేశం విశ్వాసం మరియు ఐక్యత ఫలాలకు సంకేతం" అని పోప్ లియో అన్నారు. "ఇంటి నుండి దూరంగా ఉన్నప్పటికీ, మీరు మీ శక్తివంతమైన సంప్రదాయాలను కాపాడుకుంటారు మరియు ఒకరినొకరు చూసుకుంటారు."
ఇండోనేషియా లో ముస్లిం-మెజారిటీ కలిగిన దేశంగా పరిగణించబడుతుంది మరియు కథోలికుల జనాభా దాదాపు 3% మాత్రమే.ఐనప్పటికీ "భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నారు ఆయన అన్నారు.