క్యూబా ఖైదీల విడుదల ప్రకటన నిరీక్షణకు సంకేతం అన్న కార్డినల్ పరోలిన్
బుధవారం జనవరి 15 న వాటికన్ మీడియాకు ప్రతిస్పందనగా "553 మంది క్యూబన్ ఖైదీలను క్రమంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన హవానా వార్త ఈ జూబ్లీ సంవత్సర ప్రారంభంలో నిరీక్షణకు సంకేతం" అని కార్డినల్ పియట్రో పరోలిన్ అన్నారు.
"ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం " అని ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉన్న కార్డినల్ జోడించారు,
జూబ్లీ పత్రంలో, తరువాత అనేక ఇతర సందర్భాలలో,నిరీక్షణా సంవత్సరంలో ప్రపంచ దేశాలన్నీ ఖైదీలకు క్షమాభిక్ష కొరకు పొప్ ఫ్రాన్సిస్ పిలుపునివ్వగా, హవానా అధికారులు ఈ నిర్ణయాన్ని పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తికి నేరుగా అనుసంధానించారు అని కార్డినల్ పరోలిన్ అన్నారు
యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు మరణశిక్షలను జీవిత ఖైదుగా మార్చడంతో మరియు జింబాబ్వే మరణశిక్షను రద్దు చేశారనే వార్తతో 2024 సంవత్సరం ముగిసింది" అని కార్డినల్ పరోలిన్ పేర్కొన్నారు.
"2025 ఇటువంటి సంతోషకరమైన నిర్ణయాలతో కొనసాగుతుందని, అనేక సంఘర్షణలకు ముగుంపును కూడా ఆశిస్తున్నాము" అని కార్డినల్ ముగించారు.