ఇటలీస్ ఇన్స్పెక్టరేట్ ఫర్ పబ్లిక్ సెక్యూరిటీ సభ్యులతో పొప్ ఫ్రాన్సిస్ సమావేశం

జనవరి 23 గురువారం వాటికన్ సిటీలో ఇటలీస్ ఇన్స్పెక్టరేట్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ (Italy’s Inspectorate for Public Safety)సభ్యుల వార్షిక సమావేశంలో పొప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.

“అంకితభావం, వృత్తి నైపుణ్యం మరియు దాతృత్వంతో” నిర్వహిస్తున్న పనికి పోప్ ఫ్రాన్సిస్ సంస్థ డైరెక్టర్లు మరియు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

"మీరు సాధారణ ప్రజలకు సేవ చేయడం పట్ల గర్వపడుతున్నా ," అని పోప్ వారితో అన్నారు,

వాటికన్ నగరానికి చెందిన ఇన్‌స్పెక్టరేట్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ అనేది ఇటలీ రాష్ట్ర పోలీసుల విభాగం.

ఇన్‌స్పెక్టరేట్ విధులు ప్రధానంగా సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో భద్రత కల్పించడం మరియు ప్రజా క్రమాన్ని నిర్వహించడంపై దృష్టి పెడతాయి.

శాంతియుత జూబ్లీ సంవత్సరం కొరకు తన ఆశలను వ్యక్తం చేస్తూ, సెయింట్ పీటర్స్ మరియు ఇతర పాపల్ బాసిలికాలలో తెరిచిన పవిత్ర ద్వారాలను సద్వినియోగం చేసుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు.

“పవిత్ర ద్వారం గుండా వెళ్ళడం ఒక మాయ కాదు,” తమలో తాము “విశ్వాసం యొక్క బహుమతిని” “గుర్తించలేకపోవచ్చు”, అంతర్గత పునరుద్ధరణ కోసం సమయం తీసుకోవడానికి, “తద్వారా శ్రీసభ పురాతన చిహ్నాలు తమలో ఆశను నింపుతాయి.”

పోప్ ఫ్రాన్సిస్ ఇన్స్పెక్టరేట్ సభ్యులకు మరోసారి తన కృతజ్ఞతలు తెలిపి,వారి రక్షణ కోసం ప్రత్యేక ప్రార్థనతో ముగించారు.