rva

  • యేసు తిరు హృదయ దేవాలయ రజిత జూబిలీ వేడుకలు

    Jun 10, 2024
    నెల్లూరు మేత్రాసనము,మిరియంపల్లి గ్రామము త్రిపురాంతకం విచారణలో తేదీ 29 మే నెల మంగళవారము దేవాలయ రజిత జూబ్లీ వేడుకలు అట్టహాసముగా జరిగినవి.

    25 వసంతాల క్రితం దేవాలయం నిర్మించినటువంటి గురుశ్రీ డేన్నిస్ డిసోజా గారు దివ్య పూజా బలిని సమర్పించి దేవుని యొక్క వాక్యాన్ని వివరించారు. 25 ఏళ్ల క్రితం ఏ విధముగా ఈ యొక్క మిరియంపల్లి గ్రామము దేవునిలో మమేకమై జ్ఞాన స్నానము తీసుకొని ఉన్నారో ఈనాటికి ఏ విధముగా అభివృద్ధి చెందియున్నదో ఆయన వివరించి అభినందించారు.ఈ వేడుకకు జ్ఞాపకార్థముగా సహాయమాత గృహను ప్రారంభించియున్నారు.

    దివ్యబలి పూజ అనంతరము గురువులకు సన్మానం చేసియున్నారు ఈ యొక్క వేడుకలో పాల్గొన్నటువంటి గురుశ్రీ సునీల్ కుమార్, HGN ఎర్రగొండపాలెం విచారణ కర్తలు,
    గురుశ్రీ షడ్రక్ మరియాపురం విచారణ కర్తలు, మరియు గురుశ్రీ మాదాను సందీప్ గారు MSFS,
    త్రిపురాంతకం విచారణ సహాయక గురువులు పాల్గొని యున్నారు.

    ఈ వేడుకకు 18 గ్రామాల నుంచి ఉపదేశులు మరియు విశ్వాసులు తండోపతండాలుగా వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందియున్నారు.

    ఈ వేడుకకు జ్ఞాపికగా గురువులకు వెండి గొలుసులను ఇచ్చియున్నారు. వచ్చినటువంటి గురువులకు, విశ్వాసులకు దివ్య పూజ అనంతరము ప్రేమ విందును ఏర్పాటు చేసారు. వచ్చిన వారందరికీ మరియు గ్రామ ఉపదేశులకు, గుడి పెద్దలకు విచారణ గురువులు గురుశ్రీ బండి సాగర్ సంతోష్ MSFS గారు సన్మానించి అభినందించి, కృతజ్ఞతలు తెలియచేసారు.

    గుడి ఉపదేశి అయినటువంటి వేదమని గారిని, గుడి పెద్దలైనటువంటి ఆనంద్, శేఖర్, చిన్న కోటేష్, మరియు రాజారావులను విచారణ గురువులు మరియు సహాయక గురువులు సన్మానించారు.

    ఈ వేడుకకు సహకరించినటువంటి విశ్వాసులను మరియు స్త్రీలకు మరియు ప్రతి ఒక్కరిని కూడాను విచారణ గరువులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

    సాయంకాలము ఆరు గంటల 30 నిమిషములకు యేసు తిరు హృదయ స్వరూపముతో పురవీధులలో ప్రదక్షణ గావించియున్నారు. అనంతరము అందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేసిన తదుపరి, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఉన్నారు.

    చివరి ప్రార్థనతో మరియు బాణసంచా కాల్పులతో ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవముగా ఆకాశాన్ని అంటే విధముగా చక్కగా జరిగినందుకు దేవునికి కృతజ్ఞతలు అర్పించుకొనియున్నారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరియు త్రిపురాంతకం విస్తరణ యువతి యువకులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపియున్నారు.
    ఈ యొక్క కార్యక్రమమునకు జ్ఞాపికగా దేవాలయమును దాదాపు 3 లక్షల రూపాయలతో బాగు చేసుకుని వారి కృతజ్ఞతా భావాన్ని చాటియున్నారు.
  • నూతన నియామకం

    Mar 06, 2024
    ఫ్రాన్సిస్ పాపు గారు మార్చి 5, 2024న శ్రీలంక, రత్నపుర మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా  చిలావ్ కు చెందిన గురుశ్రీ అంతోని  వైమన్ క్రూస్‌ గారిని నియమిస్తూ ప్రకటించారు.
  • అశ్రునివాళి

    Mar 02, 2024
    వరంగల్ మేత్రాసనం,మర్రిపెడ విచారణ కర్తలు, పవిత్రాత్మ సభకు (ALCP/OSS) చెందిన గురుశ్రీ మాదాను జాకబ్ గారు 2 మార్చి 2024న ఉదయం 4:30 గంటలకు గుండెపోటుతో మరణించారు.
  • నూతన నియామకం

    Feb 26, 2024
    ఫ్రాన్సిస్ పాపు గారు గురువారం, ఫిబ్రవరి 22, 2024న పునీత పేతురు బోధన సింహాసనోత్సవం రోజున ఫిలిప్పీన్స్‌, బికోల్ ప్రాంతంలోని కాసెరెస్‌ నూతన అగ్రపీఠాధిపతిగా గురుశ్రీ రెక్స్ ఆండ్రూ అలార్కాన్ గారిని నియమించారు.
  • గుంటూరు మేత్రాసనంలో చెరసాల పరిచర్య వార్షిక సమావేశం

    Feb 22, 2024
    భారత చెరసాల పరిచర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం ఫిబ్రవరి 19,2024 న గుంటూరు మేత్రాసనంలో చెరసాల పరిచర్య వార్షిక సమావేశం జరిగింది.
  • FABC అధ్యక్షులుగా భారతీయ కార్డినల్ ఎన్నిక

    Feb 22, 2024
    ఫిబ్రవరి 22న బ్యాంకాక్‌లో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) సమావేశంలో గోవా మరియు డామావో అగ్రపీఠాధిపతులు భారతీయ కార్డినల్ మహా పూజ్య ఫిలిప్ నెరి ఆంటోనియో సెబాస్టియో డో రోజారియో ఫెర్రో అధ్యక్షులుగా మరియు ఫిలిఫైన్స్,కలూకాన్  పీఠాధిపతులు మహా పూజ్య పాబ్లో విర్జిలియో సియోంగ్‌కో డేవిడ్‌ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
  • APFC రాయలసీమ ప్రాంతీయ సమావేశం

    Feb 21, 2024
    రాయలసీమ ప్రాంతీయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అఫ్ చర్చిస్ (APFC)  కడప జిల్లా యాక్షన్ కమిటీ (DAC) ఏర్పాటుపై 20 ఫిబ్రవరి 2024న కడపలోని క్యాథలిక్ బిషప్ హౌస్‌లో 05.00 నుండి 07.30 గంటల వరకు సంప్రదింపులు జరిపింది.
  • నూతన నియామకం

    Feb 17, 2024
    ఫ్రాన్సిస్ పాపు గారు ఫిబ్రవరి 17, 2024న నల్గొండ మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా గురుశ్రీ కరణం ధమ్మన్ కుమార్ MSFS గారిని నియమించారు  

    వీరికి అమృతవాణి రేడియో వేరితాస్ ఆసియా వారి తరపున హార్థిక శుభాకాంక్షలు
  • అశ్రునివాళి

    Feb 17, 2024
    కర్నూలు, అభయగిరిలోని, మెర్సీ హోమ్ నందు సిస్టర్ అమృత DSS గారు 16 ఫిబ్రవరి 2024న సాయంత్రం 6.15 గంటలకు పరమపదించారు.
  • మార్చి 22ను ప్రార్థన మరియు ఉపవాస దినంగా పాటించాలి -సిబిసిఐ

    Feb 16, 2024
    భారతదేశంలో శాంతి మరియు సామరస్యం కొరకు మార్చి 22, 2024 న ప్రార్థన మరియు ఉపవాసం చేయాలని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) వారు కోరారు.