rva

  • అశ్రునివాళి

    Apr 06, 2024
    గురుశ్రీ మార్టిన్ బోస్కో క్యూస్షన్ C.S.S.R. REDEMPTORISTS.

    గురువు యొక్క జీవితం🌹
    1)# 89 సంవత్సరాల 10 నెలలు మూడో రోజుల 60 నిమిషాల క్రితం అనగా విన్సెంట్ క్యూస్షన్ పుణ్య దంపతులకు జన్మించిన నార్త్ ఐర్లాండ్ దేశం ముద్దుబిడ్డ Fగురుశ్రీ మార్టిన్ నీకు ఇవే భారతదేశ అశ్రునివాళి

    ( 2)🍁 #65 సంవత్సరాల 10 నెలల మూడు రోజుల 60 నిమిషాల క్రితం దేవుని సేవ కొరకు అంకిత మునుర్చుకున్న యాజక భాగ్యం పొందిన శుభ ఘడియలు గురుశ్రీ మార్టిన్

    (3) # 69 సంవత్సరాల యాజక గురుత్వ సుదీర్ఘ ప్రయాణం ఈ భారత దేశంలో మీ ప్రయాణం ఎన్నో దివ్యపూజలకు దివ్య సంస్కారాలకు నాంది పలుకగా ఎంతోమంది పేద విద్యార్థుల గుండెల్లో అక్షరాభ్యసత పునాదివేసి ఎంతోమందికి అపురూపమైన గృహాలను నిర్మించిన అనారోగ్యంలో ఉన్న ఎంతోమందికి ఆరోగ్య ప్రదాతవై భారతదేశానికి వన్నెతెచ్చావు పేదల పాలిట అభాగ్యుల పాలిట దిక్కులేని వారి యెడల ఆత్మబంధువై అపర క్రీస్తు స్థానంలో ఉండి సేవ చేసిన సేవా తత్వ సత్పురుషుడు గురుశ్రీ మార్టిన్

    (4) రక్షక సభలో అఖండ జ్యోతిల వెలిగిన నీ గురి జీవితం రక్షక సభకు వెలుగు మార్గ చూపురి అయినావు ఎందరో గురువులకు ఆదర్శనీయమై ఎందరో గురువులను తయారు చేసిన నీ జీవితం ప్రయాణంలో చివరి అంతము వరకు చేసిన సేవ రక్షక సభకి ఒక వరం మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్యారిస్ గా పిలవబడే గుంటూరు జిల్లా తెనాలి పట్టణం నందు చెంచుపేటలో వెలసినటువంటి నిత్య సహాయమాత పుణ్యక్షేత్రం నందు విచారణ గురువుగా సేవలు అందించి చివరి అంతం వరకు తెనాలి విచారణ కొరకే పాటుబడిన ఓ మహర్షి గురుశ్రీ మార్టిన్

    (5) విశ్రాంతి దినం అనగా ఆదివారం రోజున జన్మించిన నీవు 💒 మరియమాత పూజిత మాసంలో మరి తల్లికి అంకితం చేయబడిన శనివారం రోజున గురిపట్టాభిషేకం పొందిన నీవు మంచి మరణం కోసం ప్రార్థన చేసుకునే పునీత జోజప్ప గారికి అంకితం చేయబడిన బుధవారం రోజునే మీరు మంచి మరణం పొందారు గురుశ్రీ మార్టిన్ నీకు ఇవే మా అంతిమ వీడ్కోలు సదా నీ ఆత్మ దేవుని రాజ్యంలో ప్రకాశించును గాక, నీ పవిత్ర ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగును గాక !


    By Anudeep Ande
    Redemptorists Priests from the Province of Bangalore
  • 2024 ఏప్రిల్ నెల పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రార్థన తలంపు

    Apr 02, 2024
    ప్రపంచంలో స్త్రీల పాత్ర కొరకు ప్రార్థిద్దాం

    ప్రతి సంస్కృతిలో స్త్రీ గౌరవం మరియు విలువ గుర్తించబడాలని,ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను అంతం అవ్వాలని ప్రార్థిద్దాం.
  • యేసు తిరుహృదయ దేవాలయంలో మ్రానికొమ్మల ఆదివారం

    Mar 26, 2024
    మానవ రక్షణ చరిత్రలో మ్రానికొమ్మల ఆదివారం ముఖ్య ఘట్టమని హైదరాబాద్ అగ్రపీఠం, లాలాగుడ, యేసు తిరుహృదయ దేవాలయం నందు మార్చి 24 2024, ఉదయం 8 గంటలకు  గురుశ్రీ  కుందూరు జోజి గారు మరియు విచారణ సహాయక  గురువు  గురుశ్రీ ప్రభాకర్ గారు   మ్రానికొమ్మలను ఆశీర్వదించి విశ్వాసులకు అందజేశారు. 
  • TSFC హైదరాబాద్ రీజినల్ కన్సల్టేషన్‌

    Mar 21, 2024
    ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చిస్ (FTC) రాష్ట్ర యూనిట్, తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ చర్చిస్ (TSFC) హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు,TSFC అధ్యక్షులు మహా పూజ్య కార్డినల్ పూలా ఆంథోని,   మరియు డోర్నకల్‌ సి.ఎస్‌.ఐ బిషప్ రైట్ రెవ.కె.పద్మారావు గార్ల అధ్యక్షతన హైదరాబాద్ రీజినల్ కన్సల్టేషన్‌ మార్చి 20, 2024న నిర్వహించబడింది.
  • ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం - అంతర్గత శాంతితోనే ప్రపంచ శాంతి

    Mar 17, 2024
    రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలం, కన్హా శాంతి వనంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ, హార్ట్ఫుల్ నెస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 14 -17 మార్చి 2024 వరకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం నిర్వహిస్తున్నారు. 
  • యేసు తిరు హృదయ దేవాలయ రజిత జూబిలీ వేడుకలు

    Jun 10, 2024
    నెల్లూరు మేత్రాసనము,మిరియంపల్లి గ్రామము త్రిపురాంతకం విచారణలో తేదీ 29 మే నెల మంగళవారము దేవాలయ రజిత జూబ్లీ వేడుకలు అట్టహాసముగా జరిగినవి.

    25 వసంతాల క్రితం దేవాలయం నిర్మించినటువంటి గురుశ్రీ డేన్నిస్ డిసోజా గారు దివ్య పూజా బలిని సమర్పించి దేవుని యొక్క వాక్యాన్ని వివరించారు. 25 ఏళ్ల క్రితం ఏ విధముగా ఈ యొక్క మిరియంపల్లి గ్రామము దేవునిలో మమేకమై జ్ఞాన స్నానము తీసుకొని ఉన్నారో ఈనాటికి ఏ విధముగా అభివృద్ధి చెందియున్నదో ఆయన వివరించి అభినందించారు.ఈ వేడుకకు జ్ఞాపకార్థముగా సహాయమాత గృహను ప్రారంభించియున్నారు.

    దివ్యబలి పూజ అనంతరము గురువులకు సన్మానం చేసియున్నారు ఈ యొక్క వేడుకలో పాల్గొన్నటువంటి గురుశ్రీ సునీల్ కుమార్, HGN ఎర్రగొండపాలెం విచారణ కర్తలు,
    గురుశ్రీ షడ్రక్ మరియాపురం విచారణ కర్తలు, మరియు గురుశ్రీ మాదాను సందీప్ గారు MSFS,
    త్రిపురాంతకం విచారణ సహాయక గురువులు పాల్గొని యున్నారు.

    ఈ వేడుకకు 18 గ్రామాల నుంచి ఉపదేశులు మరియు విశ్వాసులు తండోపతండాలుగా వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందియున్నారు.

    ఈ వేడుకకు జ్ఞాపికగా గురువులకు వెండి గొలుసులను ఇచ్చియున్నారు. వచ్చినటువంటి గురువులకు, విశ్వాసులకు దివ్య పూజ అనంతరము ప్రేమ విందును ఏర్పాటు చేసారు. వచ్చిన వారందరికీ మరియు గ్రామ ఉపదేశులకు, గుడి పెద్దలకు విచారణ గురువులు గురుశ్రీ బండి సాగర్ సంతోష్ MSFS గారు సన్మానించి అభినందించి, కృతజ్ఞతలు తెలియచేసారు.

    గుడి ఉపదేశి అయినటువంటి వేదమని గారిని, గుడి పెద్దలైనటువంటి ఆనంద్, శేఖర్, చిన్న కోటేష్, మరియు రాజారావులను విచారణ గురువులు మరియు సహాయక గురువులు సన్మానించారు.

    ఈ వేడుకకు సహకరించినటువంటి విశ్వాసులను మరియు స్త్రీలకు మరియు ప్రతి ఒక్కరిని కూడాను విచారణ గరువులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

    సాయంకాలము ఆరు గంటల 30 నిమిషములకు యేసు తిరు హృదయ స్వరూపముతో పురవీధులలో ప్రదక్షణ గావించియున్నారు. అనంతరము అందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేసిన తదుపరి, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఉన్నారు.

    చివరి ప్రార్థనతో మరియు బాణసంచా కాల్పులతో ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవముగా ఆకాశాన్ని అంటే విధముగా చక్కగా జరిగినందుకు దేవునికి కృతజ్ఞతలు అర్పించుకొనియున్నారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరియు త్రిపురాంతకం విస్తరణ యువతి యువకులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపియున్నారు.
    ఈ యొక్క కార్యక్రమమునకు జ్ఞాపికగా దేవాలయమును దాదాపు 3 లక్షల రూపాయలతో బాగు చేసుకుని వారి కృతజ్ఞతా భావాన్ని చాటియున్నారు.
  • నూతన నియామకం

    Mar 06, 2024
    ఫ్రాన్సిస్ పాపు గారు మార్చి 5, 2024న శ్రీలంక, రత్నపుర మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా  చిలావ్ కు చెందిన గురుశ్రీ అంతోని  వైమన్ క్రూస్‌ గారిని నియమిస్తూ ప్రకటించారు.
  • అశ్రునివాళి

    Mar 02, 2024
    వరంగల్ మేత్రాసనం,మర్రిపెడ విచారణ కర్తలు, పవిత్రాత్మ సభకు (ALCP/OSS) చెందిన గురుశ్రీ మాదాను జాకబ్ గారు 2 మార్చి 2024న ఉదయం 4:30 గంటలకు గుండెపోటుతో మరణించారు.