rvate

 • దివ్యపూజా పఠనాలు మే 19,2024

  May 18, 2024
  మొదటి పఠనము: అపొస్తలుల కార్యములు 2:1-11
  భక్తి కీర్తన: కీర్తన గ్రంథము 104:1, 24, 29-30, 31, 34
  రెండవ పఠనము: కొరింతీయులకు వ్రాసిన 1వ లేఖ 12:3-7, 12-13
  సువిశేష పఠనము: యోహాను సువార్త 20:19-23
 • హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ స్వర్ణ జూబిలీ వేడుక

  Apr 23, 2024
  ఏప్రిల్ 19,2024న బంగ్లాదేశ్, ఢాకా, బనానీలో హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ 50వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

  "స్థానిక శ్రీసభ నిర్మించడంలో 50 ఏళ్ళ కీర్తి." అనే నేపథ్యంపై జూబ్లీ వేడుక జరిగింది.

  బంగ్లాదేశ్‌లోని పాపు గారి రాయబారి మహా పూజ్య కెవిన్ రాండాల్ గారు, 8 మంది ఇతర పీఠాధిపతులు,250 మంది గురువులు, 600 మందికి పైగా కథోలిక విశ్వాసులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

  ఢాకా అగ్రపీఠాధిపతులు మహా పూజ్య బెజోయ్ యెన్ డి' క్రూజ్ OMI గారు గౌరవ అతిథిగా ఈ వేడుకను అలంకరించగా,బారిసాల్‌ పీఠాధిపతులు,ఎపిస్కోపల్ కమీషన్ అధ్యక్షులు మహా పూజ్య ఇమ్మాన్యుయేల్ కె. రోజారియో గారు దివ్యబలి పూజను సమర్పించారు.

  "హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ బంగ్లాదేశ్ కు దైవిక బహుమతి"అని కార్డినల్ పాట్రిక్ డి'రొజారియో గారు కొనియాడారు.

  హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ ఆగష్టు 23, 1973న స్థాపించబడింది మరియు మహా పూజ్య ఎడ్వర్డ్ కాసిడీ గారిచే లాంఛనప్రాయంగా ప్రారంభించబడింది.

  ఐదు దశాబ్దాలుగా ఈ గురువిద్యాలయం 987 మంది విద్యార్థులకు విద్యను అందించింది, 9 మంది పీఠాధిపతులతో సహా 445 మంది గురువులను నియమించింది మరియు 83 మంది బ్రదర్ లను , 11 మంది మఠకన్యలను మరియు సామాన్యులకు తన విశిష్ట కార్యక్రమాల ద్వారా సేవనందించింది.మొత్తం 103 మంది ఉపాధ్యాయులు ఈ ప్రయత్నానికి ప్రత్యక్షంగా సహకరించారు.
 • ఫిలిప్పీన్స్ లో మరియతల్లి పై తొలి సదస్సు

  Apr 06, 2024
  మే 1న, ఫిలిప్పీన్స్‌లోని క్యూజోన్ సిటీ, క్లారెట్ స్కూల్‌లో మరియతల్లి పై తొలి సదస్సు జరగనుంది

  "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు" (లూకా 1:42) అనే నేపథ్యంపై ఈ సదస్సు జరగనుంది

  ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

  ఫిలిప్పీన్స్‌లో మరియతల్లిపై ఆధ్యాత్మికతను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు క్లారెషియన్ కమ్యూనికేషన్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురుశ్రీ డెన్నిస్ తమయో తెలిపారు.

  "మరియతల్లితో మా ప్రయాణం ముగియలేదు. యుగాలుగా, ఆ తల్లి మాకు తోడుగా ఉంది, మమ్మల్ని దేవునికి దగ్గరగా నడిపించింది" అని గురుశ్రీ తమయో అన్నారు.
 • వాటికన్ సినడ్ సమావేశంలో పాల్గోనున్న ముగ్గురు ఫిలిపినో గురువులు.

  Apr 05, 2024
  ఏప్రిల్ 28 నుండి మే 2 వరకు వాటికన్‌లో జరిగే ప్రపంచవ్యాప్త విచారణ గురువుల సమావేశంలో పాల్గొనేందుకు ముగ్గురు ఫిలిపినో గురువులు ఎంపికయ్యారు.

  1 .మొన్సిగ్నోర్ జోయెల్ బ్రూనో బారుట్, వికార్ జనరల్-లావోగ్ మేత్రాసనం,
  టీమ్ మినిస్ట్రీ మోడరేటర్, లావోగ్ సిటీలోని సెయింట్ విలియం ది హెర్మిట్ కేథడ్రల్

  2 .మొన్సిగ్నోర్ మార్నిటో బన్సిగ్, ఎపిస్కోపల్ వికార్, మాసిన్ మేత్రాసనం,వికార్ ఫోరేన్, ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ వికారియేట్,విచారణ గురువులు, బాటో, లేటేలోని హోలీ చైల్డ్ విచారణ
  3 .మొన్సిగ్నోర్ జూలియస్ రోడుల్ఫా,వికార్ జనరల్, ఎపిస్కోపల్ వికార్ మరియు దావో అగ్రపీఠ పాస్టరల్ డైరెక్టర్,దవావో నగరంలోని శాన్ పెడ్రో కేథడ్రల్ విచారణ, పార్శియల్ వికార్ లు ఎన్నికయ్యారని ఫిలిప్పీన్స్‌లోని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (CBCP) సెక్రటరీ-జనరల్
  మొన్సిగ్నోర్ బెర్నార్డో పాంటిన్వా గారు తెలిపారు

  ఫిలిప్పీన్ ప్రతినిధి బృందం కోసం దేశంలోని ప్రధాన దీవుల్లోని లుజోన్, విసయాస్ మరియు మిండనావో నుండి ఒక గురువుని ఎంపిక చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు పాంటిన్ తెలిపారు.

  విచారణ గురువుల సినడ్ సమావేశాలు ఏప్రిల్ 28 నుండి మే 2 వరకు రోమ్ సమీపంలోని సాక్రోఫానోలోని ఫ్రటెర్నా డోమస్‌లో జరుగుతుంది, దాదాపు 300 మంది హాజరయ్యే అవకాశం ఉంది.

  సమావేశం యొక్క చివరి రోజున, పోప్ ఫ్రాన్సిస్ పాల్గొనేవారితో వ్యక్తిగతంగా సమావేశమవుతారు.

  ఈ ప్రపంచవ్యాప్త సమావేశం యొక్క ఫలితాలు ఈ అక్టోబర్‌లో జరిగే సినడల్ అసెంబ్లీ రెండవ సెషన్‌కు సంబంధించిన వర్కింగ్ డాక్యుమెంట్ అయిన ఇన్‌స్ట్రుమెంటమ్ లాబోరిస్‌ను రూపొందించడానికి ఉపయోగించబడతాయి.
 • పవిత్ర గురువారము - కడరా భోజన సంస్మరణ

  Mar 28, 2024
  ప్రేమ ఆజ్ఞ స్థాపన ద్వారా మనం ఒకరికొకరం ప్రేమతో జీవించాలి

  దివ్యసత్ప్రసాద స్థాపన ద్వారా ప్రభవు మనతో వాసం చేస్తారు

  గురుత్వ స్థాపన ద్వారా గురువు దేవునికి- ప్రజలకు వారధిగా సేవలందిస్తారు

  గురువులందరికి పండుగ శుభాకాంక్షలు
 • మ్రానికొమ్మల ఆదివారము |మార్చి 24

  Mar 23, 2024
  * యేసుని యెరూషలేము పుర ప్రవేశం శ్రమల వారానికి నాంధి

  * వినయశీలుడై, శాంతి దూతగా గాడిదపై ఆసీనుడై వచ్చాడు

  * అధికారంతో గాక, ఒక బలహీనుడిగా నగరంలో ప్రవేశించారు.

  * ప్రజలు దారి గుండ తమ వస్త్రములను పరుచుట

  * ఖర్జూరపు మట్టలతో యేసుకు స్వాగతం

  హోసన్నా! ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక!