TSFC హైదరాబాద్ రీజినల్ కన్సల్టేషన్‌

ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చిస్ (FTC) రాష్ట్ర యూనిట్, తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ చర్చిస్ (TSFC) హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు,TSFC అధ్యక్షులు మహా పూజ్య కార్డినల్ పూలా ఆంథోని,   మరియు డోర్నకల్‌ సి.ఎస్‌.ఐ బిషప్ రైట్ రెవ.కె.పద్మారావు గార్ల అధ్యక్షతన హైదరాబాద్ రీజినల్ కన్సల్టేషన్‌ మార్చి 20, 2024న నిర్వహించబడింది.

ఈ కార్యక్రమం CSI మెదక్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ ప్రాంతాల్ల నుండి  క్రైస్తవ, కథోలిక సంఘాలకు చెందిన పలువురు ప్రముఖులు, పాస్టర్లు, గురువులు హాజరయ్యారు. 

హైదరాబాద్ రీజియన్‌లో ప్రాంతీయ యూనిట్లు మరియు జిల్లా యాక్షన్ కమిటీలు (డిఎసి) ఏర్పాటు చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

టిఎస్‌ఎఫ్‌సి కార్యనిర్వాహక కార్యదర్శి రెవ. యు. డేనియల్ స్వాగతం పలికారు.

గురుశ్రీ రాజు అలెక్స్, FTC లక్ష్యాలు, లక్ష్యం మరియు కార్యకలాపాలపై పాల్గొనేవారికి అవగాహన కల్పించారు మరియు ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవులందరి ఐక్యత కోరారు.

FTC సలహాదారి శ్రీ.జే.ఆర్.సుధీర్, ప్రాంతీయ యూనిట్లు మరియు DACల ఏర్పాటుపై మార్గదర్శకాలను సమర్పించారు.

ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన TS-క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దీపక్ జాన్ గారు మరియు TS మైనారిటీ కమీషన్ వైస్ చైర్మన్ శ్రీ శంకర్ లూక్ గారు కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు అందుబాటులో ఉన్న వివిధ పథకాల గురించి వివరించి, క్రైస్తవులకు అన్ని అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనవారు అనేక పరిశీలనలు మరియు సూచనలు చేసారు.

ఈ ప్రాంతంలో క్రైస్తవ ఐక్యతను పెంపొందించడంలో వారి పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తామని వాగ్దానం చేశారు.

ప్రాంతీయ మరియు DACల ఏర్పాటును అమలు చేయడానికి విస్తృత ప్రాతినిధ్యంతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు.

కార్యక్రమం చివరిగా విచ్చేసిన ప్రతినిధులకు గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు కృతఙ్ఞతలు తెలిపారు.

Tags