ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం - అంతర్గత శాంతితోనే ప్రపంచ శాంతి

రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలం, కన్హా శాంతి వనంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ, హార్ట్ఫుల్ నెస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 14 -17 మార్చి 2024 వరకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం నిర్వహిస్తున్నారు. 

16 మార్చి 2024న జరిగిన సమ్మేళనానికి హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా శ్రేష్ఠులు కార్డినల్ పూల అంథోని గారు ముఖ్య అతిధులుగా ఆహ్వానించబడ్డారు. 

ప్రపంచ వ్యాప్తంగా అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలను ఒక చోటికి చేర్చడం గొప్ప విషయమనన్నారు. ధ్యానంతో ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండగలుగు తారని, దీంతో ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని వివరించారు. 

శాంతి వనంలో ఏర్పాటు చేయడంతో పాటు ప్రపంచ శాంతి కోసం హార్టుల్ నెస్ సంస్థ గురూజీ కమేష్ పటేల్ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. సర్వమతాల సందేశం ఒక్కటేనని, ప్రపంచ శాంతినే అన్ని మతాలు కోరుకుంటాయని కార్డినల్ గారి 16 మార్చి న జరిగిన ప్రారంభ ప్రసంగంలో తెలిపారు 

ఈ సమ్మెళనంలో తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య వివిధ సేవా విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags