నూతన నియామకం

ఫ్రాన్సిస్ పాపు గారు మార్చి 5, 2024న శ్రీలంక, రత్నపుర మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా  చిలావ్ కు చెందిన గురుశ్రీ అంతోని  వైమన్ క్రూస్‌ గారిని నియమిస్తూ ప్రకటించారు.

క్రూస్ గారు నవంబర్ 8, 1967న చిలావ్‌లో జన్మించారు. సెప్టెంబరు 16, 2000న చిలావ్ మేత్రాసన గురువుగా అభిషేకింపబడ్డారు. 23 సంవత్సరాలకు పైగా గురువుగా తన సేవను అందిస్తున్నారు.

క్యాండీలోని అవర్ లేడీ ఆఫ్ లంక నేషనల్ మేజర్ సెమినరీలో తత్వశాస్త్రం మరియు వేదాంతశాస్త్రంలో అధ్యయనాలను పూర్తి చేసారు.

2000–2001 వరకు తలవిలా,సెయింట్ ఆన్స్ పుణ్యక్షేత్ర ప్రాంతీయ వికార్ గాను 

2001 -2009 వరకు మంపూరి,సెయింట్ మేరీస్ విచారణ గురువుగా 

2009 -2010 వరకు సెయింట్ జోసఫ్ వాజ్ మేత్రాసన పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ గా 

2010 -2011 కట్టైకాడు,సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విచారణ గురువుగా

2011–2014 వరకు నేపుల్స్‌లోని కాపోడిమోంటే, సెయింట్ థామస్ అక్వినాస్ సెక్షన్‌లోని పొంటిఫికల్ థియోలాజికల్ ఫ్యాకల్టీ ఆఫ్ సదరన్ ఇటలీలో పాస్టరల్ థియాలజీ మరియు క్రైస్టాలజీలో లైసెన్షియేట్ పొందారు , అదే సమయంలో నేపుల్స్‌లోని శ్రీలంక కమ్యూనిటీకి చాప్లిన్‌గా పనిచేసారు.

2015-2019 వరకు కారితాస్ మేత్రాసన డైరెక్టర్ గా,

2019 నుండి చిలావ్ మరియు పుట్టలం ప్రాంతాల డీనరీలకు దేవాలయ భూములుకు మేత్రాసన డైరెక్టర్ మరియు ఎపిస్కోపల్ వికార్‌గా ఉన్నారు.

మునుపటి పీఠాధిపతులు మహా పూజ్య ఆల్బర్ట్ మాల్కం రంజిత్ పాతబెండిగే డాన్, మహా పూజ్య హెరాల్డ్ ఆంథోనీ పెరెరా, మహా పూజ్య ఇవాన్ తిలక్ జయసుందర మరియు మహా పూజ్య క్లీటస్ చంద్రసిరి పెరెరా గార్ల తరువాత క్రూస్ గారు రత్నపుర మేత్రాసన ఐదవ పీఠాధిపతి అవుతారు.

రత్నపుర మేత్రాసనం నవంబర్ 2, 1995న స్థాపించబడింది. ఈ మేత్రాసనం సబరగమువా ప్రావిన్స్‌లో ఉంది.

వాటికన్ డేటా (2022) ప్రకారం,ఈ మేత్రాసనంలో 24 విచారణలు 19,521 మంది కతోలికులు  ఉన్నారు.

Tags