మరియగిరిలో బహిరంగ సిలువ మార్గం

wayofthecross

మరియగిరిలో బహిరంగ సిలువ మార్గం

శ్రీకాకుళం మేత్రాసనం, క్రైస్తవుల సహాయమాత పుణ్యక్షేత్రం మరియగిరిలో "బహిరంగ సిలువ మార్గం" ను ప్రదర్శించనున్నారు.  క్రైస్తవులు సహాయమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ , శ్రీకాకుళ మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ చల్ల డేవిడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది.  

మార్చి 09,2024 రెండవ శనివారం ఉదయం 8 గం||లకు రాజాం విశ్వాసులచే ఈ సిలువ మార్గం ప్రదర్శింపబడుతుంది.
ఉదయం 11 గం॥ లకు గురుశ్రీ చల్ల డేవిడ్ గారు గురువులందరితో కలసి సమిష్టి దివ్య పూజాబలి సమర్పించనున్నారు. ఈ దివ్య పూజాబలిలో ప్రధానార్చకులు గా మోన్సిగ్నోర్ దూసి దేవరాజు గారు పాల్గొనన్నారు మరియు దైవ సందేశాన్ని మేత్రాసన ఛాన్స్లర్  గురుశ్రీ అల్లం విజయరెడ్డి గారు అందించనున్నారు.

ప్రతీ శనివారం ఉదయం గం|| 9-30 ని॥లకు దివ్య నత్ప్రసాద ఆరాధన, జపమాల, వాక్యపరిచర్య మరియు 11 గం॥ లకు దివ్యపూజా బలి సమర్పించబడును అని గురుశ్రీ చల్ల డేవిడ్ గారు తెలిపారు.

 ఈ శ్రమదినాలలో అనుదినం దేవుని వాక్యాన్ని చదువుతూ,  దేవుని చిత్తనుసారంగా జీవిస్తూ , ఆ  దేవుని దీవెనలు పొందాలని కోరుతూ  గురుశ్రీ చల్ల డేవిడ్ గారు దీక్షాపరులు , విశ్వాసులను "బహిరంగ సిలువ మార్గం"నికి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer