స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడితో సమావేశమైన పోప్ లియో
డిసెంబర్ 4 న స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడు Peter Pellegriniని ప్రేక్షకుల సమావేశం ముందు పోప్ లియో కలిసారు
పోప్ తో సమావేశం అనంతరం అధ్యక్షుడు Peter వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో పాటు రాష్ట్రాలతో సంబంధాల అండర్-సెక్రటరీ మోన్సిగ్నోర్ Mihăiță Blajతో సమావేశమయ్యారు.
సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన స్నేహపూర్వక చర్చలలో భాగంగా హోలీ సీ మరియు స్లోవాక్ రిపబ్లిక్ మధ్య ప్రాథమిక ఒప్పందంపై సంతకం చేసిన 25 వసంతాలు పూర్తవుతుండగా బలమైన ద్వైపాక్షిక సంబంధాల పట్ల పరస్పర ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
సామాజిక ఐక్యతకు మద్దతు ఇవ్వడం, దానిని బలోపేతం చేయడం, న్యాయాన్ని ప్రోత్సహించడం మరియు కుటుంబాన్ని కాపాడటం అనే నిబద్ధత కూడా పునరుద్ఘాటించబడింది.
అంతర్జాతీయ సమస్యల గురించి కూడా చర్చించారు, ఉక్రెయిన్‌లో యుద్ధం మరియు యూరోపియన్ భద్రతపై దాని ప్రభావం, అలాగే మధ్యప్రాచ్యంలోని పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు