సెయింట్ కాథరీన్ ఆఫ్ సియానా సభ్యులతో సమావేశమైన పోప్ ఫ్రాన్సిస్
వాటికన్, క్లెమెంటైన్ హాల్ నందు సెయింట్ కాథరీన్ ఆఫ్ సియానా సభకు చెందిన మఠకన్యలతో జనవరి 4, 2025న పొప్ ఫ్రాన్సిస్ సమావేశమయ్యారు.
"ప్రభువుకు దగ్గరగా జీవిస్తూ, దైవాంకిత జీవితానికి వన్నె తీసుకురావాలని" పొప్ ఫ్రాన్సిస్ వారిని కోరారు
సెయింట్ కాథరీన్ ఆఫ్ సియానా సభ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని ఆ సభ పదిహేనవ జనరల్ ఎలక్టివ్ చాప్టర్‌లో పాల్గొన్న వారితో ఆయన మాట్లాడారు
"పవిత్రత ఆనందాన్ని ఇస్తుంది, పవిత్రత ఆకర్షిస్తుంది, దానిని కనుగొనడం సులభం కానప్పటికీ పవిత్రతె "ఆధ్యాత్మిక ఆనందం." అని పొప్ ఫ్రాన్సిస్ అన్నారు
దేవుని దయ ద్వారానే “ఆధ్యాత్మిక ఆనందం” సాధించగలమని మరియు నేటి ప్రపంచంలో ముఖ్యంగా యువకులను ఉత్తేజపరిచేందుకు ఇవి చాలా ముఖ్యమైనవని పొప్ ఫ్రాన్సిస్ గుర్తు చేసారు .
అందరి పట్ల స్నేహపూర్వకంగా మరియు ప్రేమగా మెలగాలని, దైవ మానవ సేవలో వర్ధిల్లుతూ శ్రీసభకు బలాన్ని చేకూర్చాలని పొప్ ఫ్రాన్సిస్ వారిని కోరారు.