10వ ప్రాంతీయ యువతా సదస్సుకు సన్నాహకంగా సమావేశమైన కోర్ కమిటీ

10వ ప్రాంతీయ యువతా సదస్సుకు సన్నాహకంగా సమావేశమైన కోర్ కమిటీ 

జనవరి 3 ,2025 న తెలుగు కతోలిక పీఠాధిపతుల సామాఖ్య ప్రాంతీయ యువతా విభాగం వారి ప్రత్యేక కోర్ కమిటీ సమావేశం జరిగింది. 

శ్రీకాకుళం పీఠాధిపతులు, టిసిబిసి యువతా విభాగం అధ్యక్షులు మహా పూజ్య విజయకుమార్ రాయరాల ఆధ్వర్యంలో  హైదరాబాద్ అగ్రపీఠంలోని, సనత్నగర్, సెయింట్ థెరెసా బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగింది  

11 నుండి 14 జనవరి 2025 వరకు జరుగబోయే 10 వ ప్రాంతీయ యువతా సదస్సుకు సన్నాహకంగా ప్రత్యేక కోర్ కమిటీ సమావేశం జరిగింది.

ప్రాంతీయ యువజన డైరెక్టర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ కార్యక్రమం గురించి వివరించారు.

JMJ హైదరాబాద్ ప్రొవిన్సియల్ సిస్టర్ పౌలిన్ నుసి,JMJ కాన్వెంట్ సుపీరియర్ 
సిస్టర్ ముక్త, సెయింట్ థెరిసా స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ సుజాత దాసరి, సెయింట్ థెరిసా ఆసుపత్రి నిర్వాహకురాలు సిస్టర్ నిర్మల, ఇతర జేఎంజే సభ మఠకన్యలు,అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్, జ్యోతిర్మయి సంస్థ డైరెక్టర్ గురుశ్రీ మాదాను అంతోని మరియు శ్రీ రాయడన్ రోచ్  గార్లు పాల్గొన్నారు.

Tags