సెప్టెంబర్ మాస ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్

పోప్ లియో సెప్టెంబర్ మాస ప్రార్థనా ఉదేశాన్ని Pope Worldwide network వారు విడుదల చేశారు
పునీత ఫ్రాన్సిస్ ప్రేరణతో, దేవునిచే ప్రేమించబడిన, ప్రేమ మరియు గౌరవానికి అర్హులైన అన్ని జీవులతో మన పరస్పరం ఆధారపడి జీవుంచులాగున ప్రార్థించమని పోప్ వీడియో సందేశంలో మనల్ని ఆహ్వానిస్తున్నారు.
దేవుని సృష్టిని సంరక్షించే బాధ్యత ఎంతో ముఖ్యమైనదని తెలియపరిచారు.
ప్రకృతిలోని ప్రతీ దానిని ఉపయోగించుకోవడం మాత్రమే కాకుండా,దానిని జాగ్రత్తగా చూసుకోవాలి, మన ముందు తరాలకు అందించడానికి బాధ్యత వహించాలి.
మన క్రియల ద్వారా ప్రకృతికి కలిగే నష్టాన్ని తగ్గించి,"సృష్టి అంతటా నీ ఉనికిని కనుగొనడంలో మాకు సహాయం చేయమని, తద్వారా ఈ భూగ్రహాని కాపాడే నైతిక బాధ్యత వహించే శక్తి దయచేయమని ప్రార్థిస్తూ పోప్ ముగించారు