కొట్టాయంలో CDPI 21వ జాతీయ సమావేశం

కొట్టాయం, విజయపురం మేత్రాసనంలో విమలగిరి పాస్టరల్ సెంటర్‌లో ఫిబ్రవరి 25, 2025న Conference of Diocesan Priests of India(CDPI) 21వ జాతీయ సమావేశం జరిగింది
"మేత్రాసన గురువులు దేవుని ప్రజలకు అనగా స్థానభ్రంశం చెందినవారు, అణగారినవారికొరకు ఆశ మార్గచూపరులుగా ఉండాలని " అనే అంశంపై దృష్టి సారించింది.
CCBI దైవపీలుపులు,గురువులు,దైవాంకితులు విభాగ ఛైర్మన్ మరియు CDPI పోషకుడు మహా పూజ్య వర్గీస్ చక్కలకల్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు.
152 మంది గురువులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, స్థానభ్రంశం చెందిన మరియు అణగదొక్కబడిన వారికి ఆశాజనకంగా ఉండవలసిన అవసరాన్ని ఆయన నొక్కి వక్కాణించారు.
రెండవ రోజు, విజయపురం పీఠాధిపతులు సెబాస్టియన్ థెకెతెచెరిల్ (Bishop Sebastian Thekethecheril ) దివ్యబలిపూజకు అధ్యక్షత వహిస్తారు.
ఈ సమావేశం భారతదేశం అంతటా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను కూడా చర్చిస్తుంది, బలహీనులకు సేవ చేయడంలో మేత్రాసన గురువుల లక్ష్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఫిబ్రవరి 27, 2025న ముగుస్తుంది.