బీరుట్ పేలుడు బాధితుల కుటుంబాలను ఓదార్చిన పోప్
ఆగస్టు 2020లో బీరుట్ ఓడరేవులో జరిగిన భారీ పేలుడులో 236 మంది మరణించారు. ఇది లెబనాన్ చరిత్రలోనే అతిపెద్ద విషాదాలలో ఒకటి.
7,000 మందికి పైగా గాయపడ్డారు. ప్రాణనష్టంతో పాటు, నగరం మరియు దేశం లెక్కలేనన్ని భౌతిక నష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.
ఆరు సంవత్సరాలుగా ఓడరేవులో ఎటువంటి భద్రతా చర్యలు లేకుండా నిల్వ చేయబడిన దాదాపు 3,000 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కారణంగా ఈ పేలుడు సంభవించింది.
ఇప్పకి పేలుడు నుండి బయటపడినవారు మరియు బాధితుల కుటుంబాలు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాయి.
లెబనాన్ ప్రజలకు ఈ విషాదం కలిగించిన విస్తృత బాధను తెలుసుకున్న పోప్ లియో, పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు.
తన సందర్శన సమయంలో, పోప్ బాధితుల కుటుంబాలను కలిశారు, వారిని ఆయన ఓదార్చి , వారికొరకు ప్రార్థనలు చేశారు.
బాధితులను స్మరించుకునే స్మారక చిహ్నం దగ్గర నిలబడి, పోప్ లియో మౌనంగా ప్రార్ధించారు .
బీరుట్ నౌకాశ్రయం నుండి పోప్ బీరుట్ వాటర్‌ఫ్రంట్‌లో డివయబలి సమర్పించేందుకు వెళ్లారు.