బ్రెజిలియన్ అధ్యక్షుడితో సమావేశమైన పోప్ లియో

అక్టోబర్ 13, సోమవారం నాడు వాటికన్‌లో బ్రెజిలియన్ అధ్యక్షుడు Luiz Inácio Lula da Silvaతో పోప్ లియో సమావేశమయ్యారు.

బ్రెజిలియన్ అధ్యక్షుడి భార్య Janja Lula da Silva కూడా ఈ వ్యక్తిగత సమావేశంలో పాల్గొన్నారు.

మతం, విశ్వాసం, బ్రెజిల్ మరియు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి సారించారని అధ్యక్షుడు Lula da Silva X  లో పేర్కొన్నారు.

పోప్  " Dilexi Te  " విడుదలను అభినందించారు మరియు "మనం పేదవారిలో ప్రేమ నుండి విశ్వాసాన్ని వేరు చేయలేము" అనే సందేశానికి కూడా అభినందనలు తెలిపారు.

బ్రెజిల్ అమెజాన్‌లోని బెలెమ్‌లో నవంబర్‌లో జరగనున్న వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి సమావేశం COP30కి హాజరు కావాలని పోప్ లియోను సమావేశంలో ఆహ్వానించానని అధ్యక్షులు రాశారు.

COP30కి హాజరు కాలేకపోయినా బ్రెజిల్‌ను సందర్శించమని పోప్ ను ఆహ్వానించినట్లు  అధ్యక్షుడు తెలిపారు.

ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) రోమ్‌లో నిర్వహించే ప్రపంచ ఆహార వేదికలో పాల్గొనడానికి అధ్యక్షుడు లూలా డ సిల్వా రోమ్‌లో ఉన్నారు. 

Tags