అసత్య వార్తలు ప్రజాస్వామ్య ప్రక్రియకే భంగం అన్న పోప్ ఫ్రాన్సిస్
డిజిటల్ మీడియా వేదికగా అసత్య వార్తలు, నకిలీ సమాచారం విచ్చలవిడిగా వెలువడటంతో నిజమైన సమాచారం మరుగున పడుతుందని పోప్ ఫ్రాన్సిస్ అవేదన వ్యక్తపరిచారు.
ముఖ్యంగా కృతిమ మేధస్సు వచ్చిన తర్వాత ప్రజల మనసును కలవరపరిచే తప్పుడు సమాచారమే ఎక్కువగా వ్యాపిస్తున్నదని పోప్ ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేసారు .
అసత్య వార్తలు సమాజ పునాదుల సుస్థిరతను దెబ్బతీస్తాయని, అసత్య వార్తలు వల్ల హింసలు చెలరేగటాన్ని నిత్యం మనం చూస్తున్నామని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.
సువిశేష విలువలు వ్యాప్తి చేయటంలో సామాజిక మాధ్యమాలను తెలివిగా వాడుకోవాలని ముఖ్యంగా నిరుపేదలు, శరణార్థులు, వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లటంలో చురుకైన పాత్రను పోషించాలని అన్నారు.
నకిలీ వార్తలను నిరోధిస్తూ, నిజమైన, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని వారిని చైతన్య పరచాలని పొప్ ఫ్రాన్సిస్ కోరారు.