నూతన దేవాలయం ప్రారంభోత్సవం

నూతన దేవాలయం ప్రారంభోత్సవం

గుంటూరు పీఠంలోని, కతోలిక విశ్వాసానికి పుట్టినిల్లు అయిన విచారణలలో పెదవడ్లపూడి విచారణ ఒకటిగా పేరుగాంచినది.ఈ  విచారణలో  పునీత మిఖాయేలుగారి నూతన దేవాలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం గుంటూరు పీఠాధిపతులు మహా పూజ్య భాగయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
భారతదేశం  పాపుగారి రాయబారి ఐన అగ్రపీఠాధిపతులు మహా పూజ్య లియోపోల్డో జరిల్లి  గారు  ముఖ్య అతిధులుగా పాల్గొని తెలుగు  పీఠాధిపతులతో  కలసి నూతన దేవాలయాన్ని ప్రతిష్టించారు.పెద్దవడ్లపూడి విశ్వాసులు, మేళ తాళాలతో, సాంప్రదాయ నృత్యాలతో మహా పూజ్య లియోపోల్డో జరిల్లి గారికి , పీఠాధిపతులకు, ప్రతిష్టోత్సవానికి వచ్చిన గురువులకు ఘనంగా స్వాగతం పలికారు.నూతన హంగులతో, సుందరమైన స్వరూపాలతో, ప్రత్యేక విధంగా నిర్మింపబడిన ఈ ఆలయ ప్రతిష్టోత్సవానికి, ఉభయ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  
విచారణ కర్తలు గురుశ్రీ నల్లపాటి శౌరిబాబు గారు మాట్లాడుతూ నూతన దేవాలయ ప్రారంభోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Add new comment

4 + 2 =