ఘనంగా గుంటూరు మేత్రాసన "యేసుక్రీస్తు జయంతి 2025" జూబిలి వేడుకలు

ఘనంగా గుంటూరు మేత్రాసన "యేసుక్రీస్తు జయంతి 2025" జూబిలి వేడుకలు

గుంటూరు మేత్రాసనం, నల్లపాడు, లోయోలనగర్ లోని లొయోల పబ్లిక్ స్కూల్ ప్రాంగణం లో "యేసుక్రీస్తు జయంతి 2025" జూబిలి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను గుంటూరు పీఠాధిపతులు   మహా పూజ్య చిన్నబతిని భాగయ్య  గారు ఘనంగా ప్రారంభించారు.

మహా పూజ్య చిన్నబతిని భాగయ్య గారు గుంటూరు విశ్రాంత పీఠాధిపతులు మహా పూజ్య డాక్టర్ గాలి బాలి గారితో మరియు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజ సమర్పించారు.  మహా పూజ్య చిన్నబతిని భాగయ్య  గారు క్రీస్తు జయంతి జూబ్లీ వేడుక ప్రసంగాన్ని విశ్వాసులకు అందించారు.

గుంటూరు మేత్రాసన స్థాయిలో జరిగిన ఈ వేడుకలకు అధిక సంఖ్యలో గురువులు , కన్య స్త్రీలు , విశ్వాసులు పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆధ్యంతం కన్నుల పండుగగా జరిగింది. 

 

Article and Design By M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer