భక్తియుతంగా ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన

భక్తియుతంగా ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన

విశాఖ అతిమేత్రాసనం, ఎర్రసామంతవలస గిరిజన విచారణలో సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ స్వస్థత ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది. ఈ ప్రార్థన కూటమి అక్టోబర్ 17, గురువారం   రాత్రి  పనసబద్ర నూతన దేవాలయంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జరిగింది.

విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్రసామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధికసంఖ్యలో భక్తులు ఈ సంపూర్ణ రాత్రి జాగరణ ప్రార్థనలో పాల్గొన్నారు. సిస్టర్స్ మరియు యువతీ యువకులు తమ సహాయ సహకారాలని అందించారు.

దేవాలయ ప్రాంగణం లో పరిశుద్ద సిలువ మార్గం ధ్యానం భక్తి శ్రద్దలతో జరిగింది. అనంతరం దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ, దివ్య సత్ప్రసాద మహా ఆరాధనని భక్తియుతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గురువులు గురుశ్రీ డి జయరాజు, గురుశ్రీ సంతోష్ ,గురుశ్రీ  రాజేంద్ర గార్లు  పాల్గొన్నారు. గురువులందరు సమిష్టి దివ్యబలి పూజని సమర్పించారు. గురుశ్రీ సంతోష్ గారు అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక తైల అభిషేక స్వస్థత ప్రార్దనలును నిర్వహించారు.  

దేవాలయంలో పాప సంకీర్తనలు మరియు స్వస్థత ప్రార్దనలు నిర్వహించారు. విచారణ గాయకబృందం మధురమైన గీతాలను ఆలపించారు.

విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారు రాత్రి జాగరణ ప్రార్థనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer