ఘనంగా అమృతవాణి స్వర్ణ జూబిలీ ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా అమృతవాణి స్వర్ణ జూబిలీ ఆత్మీయ సమ్మేళనం  
 

అమృతవాణి స్వర్ణ జూబిలీ ఆత్మీయ సమ్మేళనం (Golden Jubilee Reunion ) ఘనంగా జరిగింది. ఏలూరు పీఠాధిపతి మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి, అమృతవాణి అధ్యక్షులు మహా పూజ్య  పొలిమేర జయరావు, D.D. గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

మహా పూజ్య  పొలిమేర జయరావు గారు అమృతవాణి సెకండ్ ఫ్లోర్ లోని  నూతన జూబిలీ హాల్ ను ప్రారంభించారు. అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు ప్రార్థనతో కార్యక్రమాని ప్రాంభించారు. ఈ కార్యాక్రమానికి అమృతవాణి కి మొదటినుండి సేవలందించిన ప్రస్తుతం ఉన్నత వృత్తులలో స్థిరపడ్డ 64 మంది కళాకారులు  హాజరయ్యారు. కరుణామయుడు లో నటించిన విజయ చందర్ గారు కూడా ఈ  ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ప్రముఖ నటుడు, రచయిత్ర, డైరెక్టర్ శ్రీ తనికెళ్ళ భరణి గారు అమృతవాణి తో ఉన్న అనుబంధాన్ని ఆడియో రూపంలో తన సందేశాన్ని అందించారు.

 

ప్రసుత్త వాణి నిలయ భవన నిర్మాణం అక్టోబర్ 1973 లో ప్రారంభం అయి, డిసెంబర్ 1974 నాటికి పూర్తయింది. మహా ఘన సామినేని అరులప్ప హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కొత్త భవనాన్ని (వాణి నిలయం) 1975 జనవరి 14న అధికారికంగా ప్రారంభించారు. అదే సంవత్సరంలో ఫాదర్ బలగర్ ఈ కేంద్రానికి భారతీయ పేరు పెట్టాలనుకుని ఉ త్తమ పేరును సూచించడానికి పోటీలు నిర్వహించారు. వివిధ పేర్లను పరిశీలించిన తరువాత "అమృతవాణి" అనే పేరును ఎంపిక చేయడం జరిగింది.

అఖిలాంధ్ర పీఠాధిపతుల ఆశీస్సులతో 1968లో “కరస్పాండెన్స్ కోర్సుల" ద్వారా క్రైస్తవ విశ్వాసం గురించి, క్రీస్తు ప్రభోదాల గురించి క్రైస్తవేతరులకు ఉచిత కరపత్రాల ద్వారా తెలియజేస్తూ ఆరంభమైన నాటి కతోలిక సమగ్ర సమాచార కేంద్రం 1975 నాటికి - రేడియో, టి.వి. దృశ్య, శ్రవణ వంటి ఆధునిక సమాచార మాధ్యమ సాధనాలన్నింటిని సమకూర్చుకుని, క్రైస్తవ సాహిత్యం, ధర్మవిజయం, “భారత మిత్రం” విభాగాలతో తెలుగు నాట శ్రీ సభలో తొలి ప్రాంతీయ సమాచార కేంద్రం “అమృతవాణి”గా ఆవిర్భవించింది.

ఈ కార్యక్రమంలో అమృతవాణి కి ఎన్నలేని సేవలందించిన వారందరిని గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని సన్మానించారు. గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు వచ్చిన వారందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేసారు.  

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer