ఘనంగా ఖమ్మం కతోలిక పీఠకాపరి అభిషేక మరియు పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం

ఘనంగా ఖమ్మం కతోలిక పీఠకాపరి అభిషేక మరియు పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం

ఖమ్మం కతోలిక పీఠకాపరి గా మహా పూజ్య సగిలి ప్రకాష్ గారు పదవీ బాధ్యతల స్వీకరించారు.
శ్రీ సభ పాలకులు మహా పూజ్య ఫ్రాన్సిస్ పోపు గారు కడప పీఠానికి చెందిన పూజ్య  మోన్సిగ్నోర్ సగిలి ప్రకాష్  గారిని ఖమ్మం మేత్రాసన నూతన పీఠాధిపతి గా నియమించియున్నారు.

కరుణ గిరి పుణ్యక్షేత్రం బృహత్ దేవాలయం లో  ఏప్రిల్ 09,2024 రోజున అభిషేక  కార్యక్రమం కన్నులపండుగగా  జరిగింది.

హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారు ఈ అభిషేక  కార్యక్రమంను ప్రధాన యాజకుని గా ఉండి, సహా అభిషేక పీఠాధిపతులు కడప పీఠకాపరి మహా పూజ్య  గాలి బాలి  గారు  మరియు వరంగల్ పీఠాధిపతులు  మహా పూజ్య  ఉడుముల బాల   గారి చే  కరుణగిరి పుణ్యక్షేత్రము బృహత్ దేవాలయ ప్రాంగణంలో ఇతర గురువులతో కలసి సమిష్టి దివ్య బలి పూజతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో  పోపుగారి ప్రతినిధి గా భారతదేశ రాయబారి (ఇండియా నూన్ షో) సెక్రటరీ ఢిల్లీ నుండి హాజరైనారు.

ఈ కార్యక్రమానికి ముందుగా ద్విచక్ర వాహనముల ర్యాలీ తో ఖమ్మం నగర కొత్త బస్టాండ్ నుండి ఖమ్మం నూతన అభిషిక్త పీఠాధిపతి మహా పూజ్య సగిలి ప్రకాష్ గారిని ఊరేగింపు గా కరుణగిరి పుణ్యక్షేత్రం వరకు తీసుకు వచ్చారు.

ఈ కార్యక్రమం లో  ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇతర రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులతో పాటు వందలాది మంది పూజ్య గురువులు, కన్యా స్త్రీలు, బ్రదర్స్ తో పాటుగా అధికసంఖ్యలో   కతోలిక విశ్వాసులు, భక్తులు పాల్గొన్నారు.

 


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer