గాజాలో శాంతి కోసం 'తక్షణ చర్యలు' తీసుకోవాలని ఫ్రాన్సీస్ జగద్గురువులు కోరారు.

గాజాలో శాంతి కోసం 'తక్షణ చర్యలు' తీసుకోవాలని  ఫ్రాన్సీస్ జగద్గురువులు
కోరారు.

జూన్ 9న వాటికన్‌లో ఆదివారం నాడు ఏంజెలస్‌ వద్ద ప్రార్థనలలో  మహా పూజ్య ఫ్రాన్సీస్ జగద్గురువులు గాజాలో శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. అయన మాట్లాడుతూ అత్యంత అవసరమైన మానవతా సహాయంతో గాజా ప్రజలకు సహాయం చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

వచ్చేవారం జోర్డాన్‌లో జరగనున్నశిఖరాగ్ర సమావేశంలో శాంతి ప్రయత్నాలను ఆయన ప్రోత్సహిస్తున్నారు. పాలస్తీనియన్లు మరియు ఇజ్రాయెల్‌లు శాంతి కొరకు కాల్పుల విరమణ మరియు బందీల విముక్తి కోసం ప్రయత్నించాలని , ఇరువురి ప్రతిపాదనలు వెంటనే ఆమోదించబడతాయని నేను ఆశిస్తున్నాను" అని ఫ్రాన్సీస్ జగద్గురువులు అన్నారు .

 అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడంతో ఇజ్రాయెల్-గాజా యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడిలో  1,194 మంది మరణించారు. మిలిటెంట్లు 251 మంది ఇజ్రాయెలీలను ని బందీలుగా పట్టుకున్నారు, వీరిలో 120 మంది గాజాలో ఉన్నారు, వీరిలో 41 మంది చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ఇజ్రాయెల్ యొక్క ప్రతీకార సైనిక దాడిలో గాజాలో కనీసం 36,731 మంది మరణించారు, ఎక్కువ మంది పౌరులు కూడా మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని భూభాగం యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది, AFP నివేదించింది.

 ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్  జోర్డాన్‌లో జూన్ 11న గాజాలో పరిస్థితులపై  అంతర్జాతీయ సదస్సును నిర్వహించడాన్ని ఫ్రాన్సీస్ జగద్గురువుల ప్రశంసించారు.

ఫ్రాన్సీస్ జగద్గురువుల ప్రసంగంలో "వేదనకు గురైన ఉక్రేనియన్ ప్రజలను మరచిపోవద్దని, వారు ఎంత ఎక్కువ బాధపడుతారో, అంత ఎక్కువగా శాంతిని కోరుకుంటారు" అని తన ప్రేక్షకులకు గుర్తు చేశారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer