విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, రక్షణగిరి పుణ్యక్షేత్రంలో జనవరి 2, 2025న విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు అధికారికంగా జూబ్లీ 2025 సంవత్సరాన్ని ప్రారంభించారు.
విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంత వలస గిరిజన విచారణ లో క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం ఆవిర్భావ వేడుకలకు సిద్ద పడుతూ మొదటి రోజు నవదిన పూజా ప్రార్థనలు ఘనంగా జరిగాయి.
విశాఖ అతిమేత్రాసనం,ఎర్ర సామంత వలస గిరిజన విచారణ, క్రీస్తు రాజు పుణ్యక్షేత్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఎర్ర సామంత వలస విచారణ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు .
విశాఖ అగ్రపీఠం, కోటనరవ విచారణలో పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగేలా గృహాల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేయాలని పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ ప్రకాశ్ గారు అన్నారు.
విశాఖ అతిమేత్రాసనం, మల్కాపురం విచారణ, సెయింట్ జోసెఫ్ ది వర్కర్ (St. Joseph the Worker Catholic Church ) దేవాలయం లో మరియదళ వ్యాకులమాత ప్రెసిదియం వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి.
విశాఖ అతిమేత్రాసనం, విజయనగరం విచారణ, పునీత అంతోని వారి దేవాలయం లో మరియదళ వరప్రసాదమాత ప్రెసిదియం వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. విచారణ కర్తలు గురుశ్రీ లూర్దు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
విశాఖ అతిమేత్రాసనం, ఎర్రసామంతవలస గిరిజన విచారణలో సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ స్వస్థత ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది.విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్రసామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది.
జాతీయ యువత ఆదివారం సందర్భముగా కైలాసపురం విచారణ, వేళంగణి మాత దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుశ్రీ సంతోష్ CMF, గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
విశాఖ అతిమేత్రాసనం, మహారాణిపేట విచారణలో గల "సెయింట్ ఆంతోని పాఠశాల" ఆగస్టు 1వ తేదీ నుంచి పునః ప్రారంభంకానున్నట్లు విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహా పూజ్య డాక్టర్ మల్లవరపు ప్రకాశ్ గారు తెలిపారు.