ఘనంగా మరియదళ వరప్రసాదమాత ప్రెసిదియం వేడుకలు

విజయనగరం లో ఘనంగా మరియదళ వరప్రసాదమాత ప్రెసిదియం వేడుకలు   
 
విశాఖ అతిమేత్రాసనం, విజయనగరం విచారణ, పునీత అంతోని వారి దేవాలయం లో మరియదళ వరప్రసాదమాత ప్రెసిదియం వార్షిక  వేడుకలు ఘనంగా జరిగాయి. విచారణ కర్తలు గురుశ్రీ లూర్దు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

 పునీత అంతోని వారి దేవాలయ మరియదళ సభ్యులందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ వేడుకలకు విశాఖపట్నం మరియదళ రిజియా నుండి  మేరీ జోసెఫిన్  మరియు లూర్దు మేరీలు పాల్గొన్నారు.

గురుశ్రీ లూర్దు గారు ప్రత్యేక దివ్యబలిపూజను సమర్పించారు. గురుశ్రీ లూర్దు గారు సభ్యులకొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు.

మేరీ జోసెఫిన్  మరియు లూర్దు మేరీలు మరియదళం యొక్క విశిష్టతను వారు చేయవలసిన కర్తవ్యాలను తెలుపుతూ  ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతూ ఇతరులను ఎలా ముందుకు నడపాలో  వివరించారు. ఏ. మేరీ  గారు మాట్లాడుతూ మరియతల్లి ద్వారా క్రీస్తును అనుసరించాలిని అన్నారు.

మరియదళ సభ్యుల కొరకు బైబిల్ క్విజ్ మరియు వివిధ ఆటలను నిర్వహించారు. సభ్యులలో ఒకరైన షీబా గారు మాట్లాడుతూ మరియ మాత అంటే ఎంతో ఇష్టం అని, ఈనాటి యువతకు మరియదళము యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను తెలియజేయాల్సిన అవసరం ఉందని" అన్నారు.    

విచారణ కర్తలు గురుశ్రీ లూర్దు గారు వేడుకలకు  సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer