క్రీస్తు రాజు పుణ్యక్షేత్రంలో మొదలైన నవదిన పూజా ప్రార్థనలు

 

క్రీస్తు రాజు పుణ్యక్షేత్రంలో  మొదలైన నవదిన పూజా ప్రార్థనలు

విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంత వలస  గిరిజన విచారణ లో క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం ఆవిర్భావ వేడుకలకు సిద్ద పడుతూ మొదటి రోజు నవదిన పూజా ప్రార్థనలు ఘనంగా జరిగాయి. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్రసామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది.   

క్రీస్తు రాజు పుణ్యక్షేత్ర ఆవిర్భావ 40వ రూబీ జూబిలీ సందర్భముగా గత 40  రోజులుగా దేవునికి కృతజ్ఞతగా ప్రార్థనలు , దివ్యబలిపూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రీస్తు రాజు పుణ్యక్షేత్ర మహోత్సవ ముగింపు వేడుకలు 30-11-2024 న జరగనున్నట్లు గురుశ్రీ పి జీవన్ బాబు గారు తెలిపారు.

మొదటి రోజు నవదిన పూజా ప్రార్థనలలో  ముఖ్య అతిథిగా విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్, మహారాణి పేట విచారణకర్తలు గురుశ్రీ దుగ్గింపూడి బాలశౌరి గారు  పాల్గొని  నవదిన ప్రార్థనల జెండాను ఆవిష్కరించారు. ఇతర గురువులతో కలసి సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు. అధికసంఖ్యలో భక్తులు ఈ  ప్రార్థనలో పాల్గొన్నారు.  గాయకబృందం మధురమైన గీతాలను ఆలపించారు. సిస్టర్స్ మరియు యువతీ యువకులు తమ సహాయ సహకారాలని అందించారు.

విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారు  సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.

Article and design by

M kranthi swaroop