భక్తియుతంగా పాప పశ్చాత్తాప పాదయాత్ర | వేళాంగణి మాత దేవాలయం

భక్తియుతంగా పాప పశ్చాత్తాప పాదయాత్ర
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో పాప పశ్చాత్తాప పాదయాత్ర" భక్తియుతంగా జరిగింది. శనివారం (12.04.2025) ఉ|| 5 గం||లకు వేళాంగణి మాత దేవాలయం నుండి మేరీమాత కొండ గుడి వరకు ఈ పాప పశ్చాత్తాప పాదయాత్ర నిర్వహించారు.
విచారణ కర్తలు ఫాదర్ సంతోష్ CMF, గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఫాదర్ సంతోష్ గారు విశ్వాసులు ఆధ్యాత్మికంగా ముందుకు నడిచేలా వారి కొరకు ప్రత్యేక కార్యక్రమాలను ఈ తపస్సు కాలంలో ఏర్పాటు చేసారు. అందులోని భాగంగా పాప పశ్చాత్తాప పాదయాత్రను నిర్వహించారు.
ఈ కార్యక్రంలో అధికసంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. చిన్నారులు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారు. విశ్వాసులందరు మంచి పాపసంకీర్తనం చేసి ఈస్టర్ పండుగను కొనియాడాలని ఫాదర్ సంతోష్ గారు విశ్వాసులను కోరారు.
విచారణ ప్రజలను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న ఫాదర్ సంతోష్ CMFగారిని ఆ దేవాది దేవుడు దీవించాలని కోరుకుంటూ మీ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం.
Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer