ఘనంగా క్రీస్తు పునరుత్థాన మహోత్సవం

ఘనంగా క్రీస్తు పునరుత్థాన మహోత్సవం

విశాఖ అతిమేత్రాసనం, జ్ఞానాపురంలోని పునీత పేతురు ప్రధాన దేవాలయంలో  క్రీస్తు పునరుత్థాన మహోత్సవం భక్తియుతంగా జరిగింది. విచారణ కర్తలు, విశాఖ అతి మేత్రాసన ఛాన్సలర్  ఫాదర్ జొన్నాడ ప్రకాశ్ గారి ఆధ్వర్యంలో పస్కా సాంగ్యాలు భక్తి శ్రద్దలతో జరిగాయి.

ఈ కార్యక్రమంలో విశాఖ ఆగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఉడుమల బాల గారు ప్రధాన యాజకులుగా,  ఫాదర్ జొన్నాడ ప్రకాశ్ గారు, ఫాదర్ రాజేంద్ర, ఫాదర్ రవితేజ , ఫాదర్ వినయ్, ఫాదర్ ఆంథోనీ రాజ్  ఇతర గురువులతో కలిసి పాస్కా జాగరణ సమిష్టి దివబలిపూజను సమర్పించారు.

 మొదట జ్యోతి అర్చన సాంగ్యంలో భాగంగా క్రొత్త నిప్పును తాయారు చేసి పాస్కా వత్తిని మహా పూజ్య ఉడుమల బాల గారు వెలిగించిన పిమ్మట విశ్వాసులందరితో కలిసి గురువులు వెలుగుచున్న క్రోవత్తులని చేతపట్టుకొని “ఉజ్వల కాంతులు” గీతాన్ని ఆలపించారు.

పూజ్య ఉడుమల బాల గారు తమ అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను ఆలపించారు.విచారణ యువత ఎప్పటిలాగానే తమ సహాయ సహకారాలను అందించారు. క్రీస్తు పునరుర్ధన ఘట్టాన్ని ప్రదర్శించి ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.  ఈ మహోత్సవంలో విచారణప్రజలు, విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer