భక్తి శ్రద్ధలతో సకల మృతుల స్మరణ దినోత్సవం
భక్తి శ్రద్ధలతో సకల మృతుల స్మరణ దినోత్సవం
మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగేలా గృహాల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేయాలని పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ ప్రకాశ్ గారు అన్నారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 2 వ తేదీన మరణించిన క్రైస్తవులందరి ఆత్మలు కొరకు ఆల్ సోల్స్ డే ను ఆచరిస్తారు. దీనినే ఉత్తరించు (స్థల) ఆత్మల పండుగ అని అంటారు .మరణించిన కుటుంబ సభ్యుల ఆత్మల కోసం ప్రార్థించే రోజు ఇది. కతోలిక ఆచారం చొప్పున విశ్వాసుల విన్నప ప్రార్ధనలు ప్రార్ధించుట , సమాధుల స్థలాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు, జపమాల మరియు పాటల మధ్య గురువు పవిత్ర తీర్ధజలాలతో సమాధులను ఆశీర్వదించడం జరుగుతుంది.
సకల ఆత్మల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శనివారం జ్ఞానాపురం లోని పునీత పేతురు ప్రధాన దేవాలయంలో దివ్య పూజబలిని గురుశ్రీ జొన్నాడ ప్రకాశ్ గారు నిర్వహించారు.మరణించిన విశ్వాసులకొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు.
ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో విశ్వాసులు,యువతీ యువకులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధ లతో చనిపోయిన తమ వారి కొరకు ప్రార్థనలు చేసారు. అనంతరం దేవాలయంనుండి సమాధుల వరకు ర్యాలీగా వెళ్లి సమాధుల వద్ద ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమంలో గురుశ్రీ వినయ్, శ్రీ రవీంద్ర శేషుబాబు గారు, పీపీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer