ఘనంగా విన్సెంట్ డిపాల్ ప్రాంతీయ యువత సమావేశం

ఘనంగా విన్సెంట్ డిపాల్ ప్రాంతీయ యువత సమావేశం   

విశాఖ అతిమేత్రాసనం, సాలిగ్రామపురం,  లూర్దుమత  దేవాలయంలో విన్సెంట్ డిపాల్ ప్రాంతీయ యువత సమావేశం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో లూర్దుమత  దేవాలయ విచారణ కర్తలు  గురుశ్రీ శ్రీధర్ గారు పాల్గొని విన్సెంట్ డిపాల్ యువత కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. వివిధ విచారణ నుండి అధిక సంఖ్యలో విన్సెంట్ డిపాల్ యువత పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో విన్సెంట్ డిపాల్  ప్రాంతీయ యువత అధ్యక్షులు మనోజ్ గారు , ట్రెజరర్  రాజీవ్ గారు , కోఆర్డినేటర్ శ్రీ రామరావు గారు , విశాఖపట్నం విన్సెన్ట్ డిపాల్ CC ప్రెసిడెంట్ మణి భూషణ్ రావు గారు మరియు నిర్మల మేరీ గార్లు పాల్గొన్నారు.
 
గురుశ్రీ శ్రీధర్ గారు అమూల్యమైన దైవ సందేశాన్ని అందించారు. శ్రీ రామరావు గారు మాట్లాడుతూ  పునీత విన్సెంట్ డీ పాల్ గారి జీవితం మనకు ఆదర్శం అని, పేదల పట్ల ప్రేమ కలిగి జీవించాలని అన్నారు.

మనోజ్ గారు రాబోయే క్రిస్మస్ పండుగకు ప్రణాళికలు మరియు యువత చేయబోయే కార్యక్రమాల కొరకు మాట్లాడారు.  నిర్మల మేరీ గారు మాట్లాడుతూ యువతను ప్రభుయేసుని మార్గంలో నడవాలని సూచించారు.

ఈ కార్యక్రమం విజయవతంగా జరగడానికి సహకారాన్ని అందించిన లూర్దుమత  దేవాలయ విచారణ కర్తలు గురుశ్రీ శ్రీధర్ గారికి విన్సెంట్ డిపాల్ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేసారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer