ఘనంగా పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము

ఘనంగా పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము

విశాఖ అగ్రపీఠం, కోటనరవ విచారణలో పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

నవంబర్ 06, బుధవారం రోజున జరిగీన ఈ వేడుకలకు అధిక సంఖ్యలో విశ్వాసులు , సిస్టర్స్, యువతీ యువకులు హాజరయ్యారు.  సా|| 4.30 ని॥ లకు పునీత మధర్ తెరేసా స్వరూపంతో పుర ప్రదక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
 
పండుగ రోజు ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర గురువులతో కలసి దివ్య పూజాబలిని సమర్పించారు. మహా పూజ్య పొలిమెర జయరావు గారు నూతన దివ్యసత్ప్రసాద మందసాన్ని ఆశీర్వదించారు. అనంతరం అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. ఈ దివ్య బలిపూజలో విచారణ లోని  చిన్నారులు నూతన  దివ్యసత్ప్రసాదాని స్వీకరించారు.

పండగ సందర్భముగా త్రిదిన ప్రార్ధనలు భక్తియుతంగా నిర్వహించారు. నవంబర్ 03, ఆదివారం నాడు ప్రారంభమైన త్రిదిన ప్రార్ధనలలో భాగంగా ప్రతిరోజు సా|| 6:00 గం||లకు జపమాల, 6:30 గం||లకు దివ్యబలిపూజును నిర్వహించారు. విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్  మరియు మహారాణిపేట విచారణ కర్తలు గురుశ్రీ దుగ్గంపూడి బాలశౌరి గారు  త్రిదిన ప్రార్ధనల ప్రారంభం పతాక ఆవిష్కరణ చేసారు. గురుశ్రీ దుగ్గంపూడి బాలశౌరి గారు దేవాలయ ప్రాంగణంలో నూతంగా నిర్మించిన షెడ్డును ఆశీర్వదించి, ఇతర గురువులతో కలసి దివ్యబలి పూజను సమర్పించారు.

విచారణ కర్తలు గురుశ్రీ  గురుశ్రీ రత్నకుమార్ గారు  వచ్చిన భక్తులందరికీ ప్రేమ విందుని  ఏర్పాటు చేసారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు  గురుశ్రీ  గురుశ్రీ రత్నకుమార్ గారు.  

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer