ఘనంగా క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం 40వ ఆవిర్భావ మహోత్సవం

ఘనంగా క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం 40వ ఆవిర్భావ మహోత్సవం

విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంత వలస  గిరిజన విచారణ లో క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం 40వ ఆవిర్భావ మహోత్సవం వైభవంగా, దేవునికి మహిమ కరముగా జరిగాయి. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్రసామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం ఘనంగా జరిగింది.   

ఈ కార్యక్రమంలో విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య  పొలిమేర జయరావు గారు పాల్గొని ఇతర గురువులతో కలసి దివ్యబలి పూజని సమర్పించారు.

గిరిజన విశ్వాసులు తమ గిరిజన సంప్రదాయ నృత్యం "థింసా" ద్వారా పీఠాధిపతులకు స్వాగతం పలికారు.దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన " క్రీస్తు గెత్సమనే తోట ప్రార్ధనానుభవ ఘట్టమును" మహా పూజ్య  పొలిమేర జయరావు గారు ఆశీర్వదించి ప్రారంభించారు.

40 సంవత్సరాలకు  గుర్తుగా.. దేవునికి కృతజ్ఞతగా ప్రార్థనలు , దివ్యబలిపూజా కార్యక్రమాలు  40 రోజుల పాటూ ఘనంగా నిర్వహించారు.

పండుగ రోజు తుఫానును సైతం లెక్క చేయకుండా అధికసంఖ్యలో భక్తులు ఈ  ప్రార్థనలో పాల్గొన్నారు. విచారణ గాయకబృందం మధురమైన గీతాలను ఆలపించారు. సిస్టర్స్ మరియు యువతీ యువకులు తమ సహాయ సహకారాలని అందించారు. అధికసంఖ్యలో గురువులు ,సిస్టర్ పాల్గొన్నారు.  

సాయంత్రం  4 గంటలకు  క్రీస్తు రాజు తేరుతో మహా ప్రదక్షిణ జరిగింది . మా గిరిజన ఐదు దింసా బృందాలు, క్రీస్తు రాజు తేరు ముందు నృత్యాలు చేసి, భక్తులను భక్తిపారవశ్యంలో మునిగితేలారు.

అతిమేత్రాసన ఛాన్సలర్ శ్రీ జొన్నాడ జాన్ ప్రకాశ్ గారు పాల్గొని  దివ్యసత్ప్రసాద ఆరాధన ,  ఆశీర్వాదం ఇచ్చారు . గురుశ్రీ సాగర్(CSSR) గారు చక్కని దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు . తర్వాత ధనవంతుడు లాజరు ను గొప్ప బైబిలు నాటికను నూజివీడు , ప్రేమ్ కుమార్ వారి బృందం వారిచే ప్రదర్శించబడింది .

విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారు  సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.  

 

 

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer