విజయవాడ మేత్రాసనంలో "జాతీయ క్యాథలిక్ కరిస్మాటిక్ రిన్యూవల్" యువతా విభాగమైన 'యూత్ యునైటెడ్ ఫర్ క్రైస్ట్ ' కి చెందిన వివిధ రాష్ట్రాల కోఆర్డినేటర్ల సమావేశాలు మార్చి 22 ,23 ,24 తేదీలలో " సెయింట్ ఆన్స్ సిస్టర్స్ ఆఫ్ ప్రొవిడెన్సు" వారి కాన్వెంటు లో విజయవంతం గా జరిగాయి .
హైదరాబాద్ అతిమేత్రాసనం సెయింట్ మేరీస్ కేథడ్రల్ లో పవిత్ర తైలముల దివ్య బలిపూజ భక్తియుతంగా జరిగింది. అధిక సంఖ్యలో మేత్రాసన గురువులు తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో తపస్సు కాల పాప పరిహార పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనా కూడిక భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
శ్రీకాకుళం మేత్రాసనం సహాయమాత దేవాలయంలో మార్చి 14 న పవిత్ర తైలముల దివ్య బలిపూజ భక్తియుతంగా జరిగింది. మేత్రాసన గురువులు తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.
హైదరాబాద్ అతిమేత్రాసనం పునీత జోజప్ప గారి దేవాలయం, బొల్లారం విచారణలో తపస్సు కాల ప్రత్యేక దివ్య బలిపూజ భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ వేలంటైన్ డిమెల్లో గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆంధ్ర, తెలంగాణ కథోలిక శ్రీసభకు ఎనలేని సేవలు అందించిన అమృతవాణి సికిందరాబాదు లో ఉంది. అక్కడి అమృతవాణి భవనాన్ని నిర్మించి అమృతవాణి కార్యాలయంగా ప్రారంభించి 50 వ సంవత్సరం సందర్భంగా జూబిలీ చిహ్నాన్ని ప్రారంభించారు.