భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం | Srikakulam |

భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం

శ్రీకాకుళం మేత్రాసనంలో మ్రాని కొమ్మల ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. శ్రీకాకుళం  మేత్రాణులు మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్  గారి ఆధ్వర్యంలో ఈ మ్రాని కొమ్మల ఆదివారం పండుగ  భక్తి శ్రద్ధలతో జరిగింది.

 అధికసంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు.  యేసు ప్రభువుని యెరూషలేము పురప్రవేశము’ అనే సంఘటనను ధ్యానిస్తూ  ప్రతిఒక్కరు మ్రాని కొమ్మలను పట్టుకొని ,ప్రభు యేసుని స్థుతిస్తూ  గురువులతో కలసి దేవాలయములోనికి  ప్రవేశించారు.

మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ గారు దైవసందేశాని అందిస్తూ మ్రాని కొమ్మల ఆదివారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసారు.  ఈ కార్యక్రమంలో గురుశ్రీ పాల్ భూషణ్, గురుశ్రీ ప్రేమానందం, గురుశ్రీ పసల జైపాల్ ఇతర గురువులు పాల్గొన్నారు. 

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer