ఆంధ్ర, తెలంగాణ కథోలిక శ్రీసభకు ఎనలేని సేవలు అందించిన అమృతవాణి సికిందరాబాదు లో ఉంది. అక్కడి అమృతవాణి భవనాన్ని నిర్మించి అమృతవాణి కార్యాలయంగా ప్రారంభించి 50 వ సంవత్సరం సందర్భంగా జూబిలీ చిహ్నాన్ని ప్రారంభించారు.
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో పాప పశ్చాత్తాప పాద యాత్ర" భక్తియుతంగా జరిగింది. శనివారం ఉ|| 5 గం||లకు వేళాంగణి మాత దేవాలయం నుండి మేరీమాత కొండ గుడి వరకు ఈ పాప పశ్చాత్తాప పాద యాత్ర నిర్వహించారు.
ఫ్రాన్సిస్ పాపు గారు ఫిబ్రవరి 27, 2024న కర్నూలు మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా OCD సభకు చెందిన గురుశ్రీ గోరంట్ల జ్వాన్నేసు గారిని నియమిస్తూ ప్రకటించారని తెలియచేయుటకు సంతోషిస్తున్నాం.